రష్యా మన ఎన్నారైలను ఫోకస్ చేసిందా...??
కొన్ని కొన్ని సరిహద్దు సమస్యలు మినహా ఏ విషయంలో ఎలాంటి ఇబ్బందులు కూడా లేవు అయితే ఇప్పుడు రష్యా భారత్ మీద ఎక్కువగా దృష్టి పెడుతుంది. అమెరికా అధ్యక్షుడు మారిన తర్వాత భారత్ విషయంలో కాస్త ఎక్కువగా ఆసక్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రష్యా కాస్త జాగ్రత్తగా భారత్ విషయంలో అడుగులు వేయొచ్చు. భారత్ లో ఉన్న కొంతమంది నిపుణులను తమ దేశంలోకి ఆహ్వానించే ప్రయత్నాలు చేస్తుంది. ఐటీ రంగం విషయంలో దూకుడుగా అడుగులు వేస్తున్నది రష్యా. అలాగే శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా కీలక మార్పులు చేయడానికి రెడీ అవుతుంది.
ఈ నేపథ్యంలోనే వైద్యరంగం విషయంలో కూడా దృష్టి సారించింది. భారతీయ వైద్యులకు విదేశాల్లో మంచి గుర్తింపు ఉంది. అమెరికా లో టాప్ టెన్ డాక్టర్స్ లో భారతీయులు కూడా ఉన్నారు. దీంతో ఇప్పుడు వారిని తమ దేశంలోకి ఆహ్వానించే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. బ్రిటన్ సహా కొన్ని యూరోపియన్ యూనియన్ దేశాల్లో భారతీయులు ఎక్కువగా కీలకపాత్ర పోషిస్తూ ఉంటారు. ఎక్కువగా విదేశాల్లోనే మన నిపుణులు ఉండటంతో వారిని ఆకట్టుకోవడానికి రష్యా తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తుంది. అంతే కాకుండా భారత్ లో ఉన్న చిన్నచిన్న కంపెనీల మీద కూడా దృష్టి పెట్టినట్టు సమాచారం. మేము అవకాశాలు కల్పిస్తామని తమ దేశంలోకి వచ్చి మీ నైపుణ్యాన్ని చూపించాలని రష్యా కోరుతుంది.