అమెరికా ముందు భారీ సవాల్, భారత్ సాయం కోరుతుందా...?
అలా జరిగితే కచ్చితంగా అల్ ఖైదా ఆఫ్ఘనిస్తాన్లో పునర్నిర్మాణానికి అవకాశం దొరికినట్లు ఉంటుందని అమెరికా మీడియా కొందరు అమెరికా అధికారులను ఉద్దేశిస్తూ పోస్ట్ చేసింది. గత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో తాలిబాన్లతో 2020 ఫిబ్రవరిలో కుదుర్చుకున్న ఒప్పందం పాటిస్తే మే 1 నాటికి 3,500 అమెరికన్ దళాలను ఆఫ్ఘన్ నుంచి ఉపసంహరించుకోవాలి. దీనిపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తర్జన భర్జన పడుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో యుఎస్ దళాలను కొనసాగించడానికి అనుకూలంగా ఉన్న కొంతమంది యుఎస్ అధికారులను అక్కడ ఉండాలి అని కోరుతున్నారు.
సైనికులు గడువుకు మించి ఉండాలని ఆ అధికారులు కోరుతున్నారని, అందుకు ఇంటెలిజెన్స్ నివేదికను వాడుతున్నారు అని అమెరికా మీడియా చెప్పింది. దీనిపై స్పందించడానికి వైట్ హౌస్ నిరాకరించింది. బిడెన్ గురువారం తన మొదటి వైట్ హౌస్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో గడువు ప్రకారం బయటకు రావడం కష్టం అని, దీనికి 7,000 వేల మంది మిత్రరాజ్యాల బలగాలు కూడా అవసరమని చెప్పారు. అయితే ఆఫ్ఘన్ విషయంలో కొన్ని దేశాల మద్దతు కోసం అమెరికా ప్రయత్నం చేస్తుంది. బ్రిటన్ ఇజ్రాయిల్ వంటి దేశాలతో పాటుగా భారత్ మద్దతు కూడా అమెరికా కోరే అవకాశం ఉంది.