మళ్ళీ అమెరికా పర్యటనకు మోడీ...?

Gullapally Venkatesh
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారతదేశానికి విదేశీ పెట్టుబడులు రాకపోతే ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉండవచ్చు అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా మన దేశానికి విదేశీ పెట్టుబడులు దాదాపుగా తగ్గిపోయాయి అనే అభిప్రాయాన్ని కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. దీంతో కొన్ని రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చాలా కంపెనీలు మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం లేదు అనే అభిప్రాయం ఉంది.
దేశంలో ఉన్న ప్రైవేటు రంగానికి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వడం అన్ని విధాలుగా కూడా ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడంతో ఇప్పుడు కొన్ని ఇబ్బందులు ఎక్కువగా వస్తున్నాయి. రాజకీయంగా ఇబ్బందులు ప్రధానమంత్రి మోడీ ఇబ్బందులు ఎదుర్కొంటున్న సరే పైకి కనబడకుండా మేనేజ్ చేస్తున్నారు అనే అభిప్రాయం కూడా కొంతమందిలో ఉంది. ఇప్పుడు అమెరికా కంపెనీలను మన దేశానికి తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
ఆయన త్వరలోనే ఆయన అమెరికా వెళ్ళడానికి రెడీ అవుతున్నారని... అక్కడున్న ప్రముఖ కంపెనీల అధినేతలతో ప్రధానమంత్రి మోడీ భేటీ రావొచ్చని అంటున్నారు. ముఖ్యంగా ఐటీ కంపెనీలతో పాటు ఫార్మా కంపెనీలను భారత్లోని అన్ని విధాలుగా కూడా సహకరిస్తామని చెప్పే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. మన దేశంలో నిరుద్యోగ సమస్య కూడా పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చాలావరకు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటుంది. అంతేకాకుండా భారత్ లో పెట్టుబడులు పెట్టడం కోసం ఎన్నారై లతో కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడీ సమావేశమయ్యే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీనికి సంబంధించి ప్రధాన మంత్రి త్వరలోనే కొన్ని కీలక అంశాల్లో మంత్రులతో  చర్చలు కూడా జరిగే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది. విదేశాంగ శాఖ అధికారులతో ప్రధానమంత్రి మోడీ అమెరికా వెళ్లనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: