కరోనా బారిన పడిన ఎన్నారైలు.. అప్రమత్తమైన ఆ దేశం..?
అయితే కరోనా నెగెటివ్ గా నిర్ధారణ అయిన కార్మికులను ఫ్యాక్టరీ ప్రాంగణంలోనే క్వారంటైన్ లో ఉంచారు. గత నాలుగు వారాలుగా కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్న శ్రీలంక ప్రభుత్వం సోమవారం రోజు ట్రావెలింగ్ పై లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేసింది. అయితే అక్కడి వైద్య అధికారులు మాత్రం థర్డ్ వేవ్ మరింత ప్రమాదకరంగా మారుతుందని.. లాక్ డౌన్ అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జూన్ 23వ తేదీన రాత్రి 10 గంటలకు మళ్లీ ఆంక్షలు అమలు చేస్తామని శ్రీలంక ప్రభుత్వం చెప్పినట్లు సమాచారం. ప్రత్యేక బృందాల ద్వారా ప్రజల కదలికలను తాము పర్యవేక్షిస్తామని శ్రీలంక ప్రభుత్వం వెల్లడించింది. ఆంక్షలు తొలగించినప్పటికీ ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఒక పోలీస్ అధికారి మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు.
ప్రస్తుతం శ్రీలంకలో డెల్టా వైరస్ విపరీతంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఈ ద్వీపదేశం లో ఏప్రిల్ నెలలో కరోనా థర్డ్ వేవ్ విజృంభించింది. అయితే ఏప్రిల్ నెల నుంచి ప్రతిరోజు సుమారు రెండు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. శ్రీలంక దేశంలో ఇప్పటివరకూ 2,39,689 కరోనా వైరస్ బారిన పడగా వారిలో 2,01,389 కోలుకున్నారని సమాచారం. ఇక 2,581 మంది కరోనా తో చనిపోయారని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం వెల్లడించింది.