తెలంగాణ అభివృద్ధికి భారీ విరాళాలు..?
బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామ వాస్తవ్యులైన ఏనుగు చంద్రశేఖర్ విదేశాల్లో స్థిరపడ్డారు. అయితే తెలంగాణలోని పల్లెల అభివృద్ధి కొరకు విరాళాలు సేకరిస్తున్నారు అని తెలుసుకున్న ఈ ఎన్నారై అక్షరాలా లక్ష రూపాయలు విరాళంగా ప్రకటించి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఈ విషయాన్ని చిట్టాపూర్ సర్పంచ్ వనజా గోవర్ధన్ గౌడ్ తెలిపారు. ఇక ఎడపల్లి మండలం నెహ్రూనగర్ కి చెందిన ఎన్నారై మహమ్మద్ బషీర్ఖాన్ అక్షరాల పదివేల రూపాయలు దానంగా ఇచ్చారు. ఈ విషయాన్ని సర్పంచ్ కమిటీ డిస్టిక్ సంయుక్త కార్యదర్శి అమానుల్లా షరీఫ్, ఎంపీడీవో శంకర్, మండల ప్రత్యేకాధికారి రమేశ్ వెల్లడించారు.
ఇకపోతే గల్ఫ్ యువకులు కూడా పల్లెల అభివృద్ధి కొరకై తమ వంతు సహాయం చేశారు. వారందరూ కలిసి 65 వేల రూపాయలు జమ చేసి డెడ్ బాడీ ఫీజర్ను సర్పంచు లకు అందజేశారు. స్థానిక ప్రజలు కూడా భారీ విరాళాలు అందజేశారు. మాక్లూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం రాఘవ, చంద్రకళ అనే భార్యభర్తలు ఒక లక్షా 50 వేల రూపాయలు విరాళంగా అందజేశారు. రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు సైతం లక్షల రూపాయలలో విరాళాలు అందజేసి గ్రామాల అభివృద్ధి లో భాగస్వామ్యం పంచుకున్నారు. నిజామాబాద్ రాష్ట్రంలో ఇప్పటికే పది లక్షలకు పైగా విరాళాలు అందాయని సమాచారం.