కువైట్‌లోని ఎన్నారైలకు ఆర్థిక సహాయం..?
ఓపెన్ హౌస్ కార్యక్రమంలో భారత ఎంబసీ తక్కువ ఆదాయం గల ఎన్నారైలకు లక్ష రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అయితే ఆదివారం నాడు 75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రవాసులకు లక్ష రూపాయల చొప్పున డబ్బు అందజేసారు. లక్ష రూపాయలు ఎక్కువ కాకపోవచ్చు కానీ బాధిత కుటుంబాలకు ఎంతోకొంత చేయూత అందించినట్లు అవుతుందని సిబి జార్జి పేర్కొన్నారు.
అయితే కేవలం నిరుపేద కుటుంబాలకు మాత్రమే లబ్ధి చేకూరేలా సిబి జార్జి చర్యలు చేపట్టారు. భారత ఎంబసీ కి చెందిన ముగ్గురు అధికారులు ఒక బృందంగా ఏర్పడి అల్పాదాయ వర్గాల ను గుర్తించారు. అనంతరం వారికి ఇండియన్ కమ్యూనిటీ సపోర్ట్ గ్రూపు(ఐసీఎస్‌జీ) ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేశారు. దీంతో భారతీయ ప్రవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కరోనా సంక్షోభంలో తమకు ఆర్థిక సహాయం అందించిన భారతీయ రాయబారి కి కృతజ్ఞతలు తెలిపారు.
75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని దినోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీ కి నివాళులు అర్పించిన సిబి జార్జి.. కువైట్, భారత్ మధ్య సంబంధాలు బలపడుతున్నాయని వ్యాఖ్యానించారు.