హెచ్ 1 బి వీసాల ప్రక్రియలో ట్రంప్ కు షాక్ ఇచ్చిన... కాలిఫోర్నియా కోర్ట్
అప్పుడే ఈ విధానాన్ని రద్దుచేయాలని కాలిఫోర్నియా నార్తర్న్ జిల్లా కోర్టు లో పిటిషన్ వేసింది. అయితే ఈ విషయంలో అన్ని కోణాలలో ఆలోచించి విచారణ అనంతరం న్యాయమూర్తి జాప్రీ వైట్ తాజాగా తీర్పు చెప్పారు. అప్పట్లో హెచ్ 1 బి వీసా ప్రక్రియలో ఉత్తర్వులు ఇచిన హోం ల్యాండ్ సెక్యూరిటీ సెక్రెటరీ చాధ్ ఓల్ఫ్ లీగల్ గా వెళ్లలేదని తీర్పునిచ్చింది. అంతే కాకుండా ఈ పద్ధతిని రద్దు చేస్తున్నట్లుగా తీర్పు ఇచ్చారు. మామూలుగా అమెరికాలో జీవిస్తున్న వారిలో భారత్ నుండి వెళ్లి స్థిరపడిన వారే ఎక్కువగా ఉండడం గమనార్హం. అమెరికాలో శాస్త్ర, సాంకేతిక, గణిత మరియు ఇంజనీరింగ్ లాంటి ముఖ్యమైన రంగాల్లో నిపుణులైన విదేశీయులను ఎంచుకోవడానికి హెచ్ 1 బి వీసాలను కల్పిస్తూ వచ్చింది. తద్వారా ఎక్కువ సంఖ్యలో భారతీయులు మరియు చైనా దేశస్థులు ఉన్నారు.
ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో ఈ వీసాలను పొందడానికి అప్లికేషన్ లు వస్తుంటాయి. కానీ మొత్తం మీద సంవత్సరానికి కేవలం 85 వేల మందికి మించకుండా వీసా అర్హతను కల్పిస్తున్నారు. ఇందు కోసం లాటరీ పద్ధతిని అమలు చేసేవారు. అయితే గతంలో ట్రంప్ ప్రభుత్వం సమయంలో ఈ విధానాన్ని రద్దు చేయడానికి పూనుకున్నారు. అలా ఈ కొత్త విధానాన్ని మార్చి 9 2021 న అమలులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ విధానాన్ని కాస్తా రద్దు చేస్తూ కాలిఫోర్నియా నార్తర్న్ డిస్ట్రిక్ట్ కోర్టు కొట్టివేసింది. ఓడిపోయిన ట్రంప్ కు ఇది మరో చేదువార్త అని చెప్పాలి.