ఓరినాయనో.. పాక్ రాయబారి అలాంటోడా?

praveen
మారలా.. పాకిస్తాన్ బుద్ధి అస్సలు మారలా.. అయినా ఎందుకు మారుతుంది చెప్పండి.. పాకిస్తాన్ వేరుపడిన నుంచి  ఉగ్రవాదాన్ని పెంచి పోషించడమే దాని లక్ష్యం.. ప్రపంచవ్యాప్తంగా మత రాజ్యస్థాపన చేయడమే ప్రభుత్వ ద్యేయం.. అన్ని దేశాల్లో ఇస్లామిక్ పాలన తీసుకురావడమే పాకిస్తాన్ నినాదం.. దశాబ్దాల కాలంలో పాకిస్తాన్లో ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప.. ప్రభుత్వం ఆలోచన తీరు లో మాత్రం మార్పు రావడం లేదు. పాకిస్తాన్ లోకి ఏ దేశం పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రాదు.. అటు కంపెనీలు కూడా లేవు.. ఇంత జరిగిన తర్వాత ఆర్థిక సంక్షోభం రాకుండా ఉంటుందా..


 చూస్తూ చూస్తూ ఉండగానే పాకిస్తాన్ లో ఆర్థిక సంక్షోభం పెరిగిపోయింది. ఇక పాకిస్తాన్ యుద్ధ పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందంటే ప్రభుత్వ కార్యాలయాలను అద్దెకు ఇచ్చి వచ్చిన ఆదాయంతో ఉద్యోగులకు జీతాలు చెల్లించే పరిస్థితి వచ్చింది. ఇక విదేశాల్లో ఉన్న రాయబార కార్యాలయంలో సిబ్బందికి అయితే జీతాలు కూడా ఇవ్వడంలేదు పాకిస్తాన్. దీంతో ఇక విదేశాల్లోని పాకిస్తాన్ రాయబారులు అక్కడి ప్రభుత్వాన్ని అడుక్కొని  జీతాలు పొందుతున్నారు. ఇంత జరుగుతున్నా పాకిస్థాన్ బుద్ధి మాత్రం మారలా అస్సలు మారలా.



 ఇంకా ఉగ్రవాదులని గొప్ప సైనికులుగా చూపించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. ఉగ్ర వాదులను తమ దేశాల రాయ బారులుగా పంపించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇలాంటి ప్రయత్నంలో భాగంగానే అమెరికాకు ఒక రాయబారిని పంపించింది పాకిస్తాన్. ఇక అతను ఎంత గొప్పోడు అంటే.. అతను ఉగ్రవాద కార్యకలాపాల మద్దతుదారు.. ఉగ్రవాదుల కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటాడు.. ఇస్లామిక్ రాజ్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన జైషే మొహమ్మద్ అనుబంధ సంస్థలో పనిచేశాడు అంత గొప్పోడు.. మరి పాకిస్తాన్ కి అలాంటోల్లే కదా గొప్పోళ్ళు.. అలాంటి వ్యక్తిని అమెరికాకు పాకిస్థాన్ రాయబారిగా పంపించేందుకు ప్రయత్నించగా అన్నీ తెలిసిన అమెరికా మాత్రం అనుమతించే ప్రసక్తి లేదు అంటు షాక్ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: