ఇమ్రాన్ ఖాన్ కి షాక్.. రంగంలోకి షరీఫ్?
అయితే మొన్నటి వరకు ఒకే తాటిపై ఉన్న ఆర్మీలో ఇక ఇప్పుడు చీలికలు ఏర్పడ్డాయి. ఒక వర్గం ఆర్మీ ఇమ్రాన్ ఖాన్ ను అధికారంలో కొనసాగించడానికి ప్రయత్నాలు చేస్తుంటే. అటు మరొక వర్గం మాత్రమే ఇమ్రాన్ ఖాన్ ను ఎప్పుడు గద్దె దించాలా అని ఎదురుచూస్తుంది. దీంతో పాకిస్తాన్ లో ఏ క్షణం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది అర్థం విధంగా మారిపోయింది పరిస్థితి. ఇప్పటికే ప్రతిపక్షాలన్ని ఒకతాటిపైకి వచ్చి ఇమ్రాన్ ఖాన్ కి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించేందుకు కూడా సిద్ధమయ్యారు.
ఈ క్రమం లోనే పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ను రంగం లోకి దిగ బోతున్నారు అన్నది తెలుస్తోంది. ప్రస్తుతం అనారోగ్యం తో బాధపడుతున్న మాజీ ప్రధాని షరీఫ్ లండన్ లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితు ల్లో ఆయన లండన్ వదిలి వెళ్ళవద్దు అంటూ వైద్యులు సూచిస్తున్నప్పటికీ ఇమ్రాన్ ఖాన్ ను గద్దె దించేందుకు నవాజ్ షరీఫ్ రంగం లోకి దిగేందుకు సిద్ధ మవుతున్నారు అనేది తెలుస్తుంది. రానున్న రోజుల్లో ఇమ్రాన్ ఖాన్ పదవికి ఇబ్బందులు తప్పదు అన్నది తెలుస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.