వామ్మో.. ఉక్రెయిన్ ఖాళీ అవుతోంది?
దీంతో రానున్న రోజుల్లో యుద్ధం తప్పదు అనే విధం గానే మారి పోయింది పరిస్థితి. ఇప్పటికే ఒక ఉక్రెయిన్ ని స్వాధీనం చేసుకోవడానికి రష్యా ముందుకు వచ్చింది. ఏకంగా ఇరు దేశాల మధ్య ఉన్న బఫర్ జోన్ లోకి వచ్చి యుద్ధానికి సిద్ధం అనే సంకేతాలను ఇచ్చింది. ఇక అటు యూరోపియన్ యూనియన్ నాటో దేశాల మద్దతు తో ఉక్రెయిన్ కూడా యుద్ధం చేసేందుకు సిద్ధం అన్న విధం గా వ్యవహరిస్తోంది. రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారి పోయింది.
అయితే ప్రస్తుతం ఈ యుద్ధ వాతా వరణం నేపథ్యం లో అన్ని దేశాలు కూడా ఉక్రెయిన్ లో ఉన్న తమ పౌరులను కూడా వెనక్కి తీసుకు వచ్చేందుకు సిద్ధ మయ్యాయి అయితే వెనక్కి తీసుకు వచ్చేందుకు ఎలాంటి యుద్ధ విమానాలను పంపమని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అందరూ పౌరులు వెనక్కి వచ్చేయాలంటూ ఆయా దేశాల ప్రభుత్వాలు ఆదేశాలు ఇస్తూ ఉండడం గమనార్హం. ఇలా అన్ని దేశాల ప్రభుత్వాలు తమ పౌరులను వెనక్కి తీసుకు పోతూ ఉండడంతో ఉక్రెయిన్ మొత్తం ఖాళీ అవుతుంది. ఇక ఇదంతా చూస్తూ ఉంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధం తప్పదు అని అంచనా వేస్తున్నారు విశేషాలు.