కిమ్ శాడిజం పీక్స్.. ఏం చేసాడో తెలుసా?

frame కిమ్ శాడిజం పీక్స్.. ఏం చేసాడో తెలుసా?

praveen
ఈ ప్రపంచంలో కేవలం ఏడు వింతలు మాత్రమే ఉన్నాయి అని చెప్పుకుంటూ ఉంటారు అందరు. కానీ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ కూడా ఎనిమిదో వింత అన్న విషయాన్ని కొంతమంది మాత్రమే గ్రహిస్తూ ఉంటారు. ఎందుకు అంటారా.. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ప్రజాస్వామ్య పాలన సాగుతోంది. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు పాలన సాగిస్తూ ఉంటాయి. ఒక నిర్ణీత సమయం తర్వాత మళ్ళీ ఎన్నికలు జరగడం కొత్త పాలకులు  రావడం జరుగుతూ ఉంటుంది.  కానీ ఒకప్పటిలా రాజులు రాజుల తర్వాత వారి వారసులు పాలన సాగించినట్లు గా ఇక ఇప్పుడు ఉత్తరకొరియా కింగ్ జామ్ వంశం ఎన్నో దశాబ్దాల నుంచి పాలన సాగిస్తూ వస్తోంది.

 తండ్రి మరణంతో ఉత్తరకొరియా అధ్యక్షుడి బాధ్యతలను చేపట్టిన కిమ్ జాంగ్ ఉన్ తండ్రిని మించిన నియంతగా పేరుతెచ్చుకున్నారు. ప్రతి విషయంలో కూడా చిత్రవిచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటూ ఎప్పుడూ ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారి పోతూనే ఉంటారు. తమ దేశంలో ఉన్నది మనుషులు కాదు అన్న విధంగానే దారుణంగా వ్యవహరిస్తూ ఉంటాడు కిమ్. ఇక ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ విధించే శిక్షలు కొన్ని కొన్ని సార్లు ప్రపంచదేశాలను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ఇటీవలె తోటలో పువ్వులు పూయ లేదు అనే కారణంతో తోటమాలికి జైలు శిక్ష విధించడం హాట్ టాపిక్ గా మారిపోయింది.

 ఇక ఇప్పుడు కిమ్  మరోసారి తన క్రూరత్వాన్ని బయటపెట్టుకున్నాడు. ఇటీవలే తన తండ్రి జయంతి వేడుకలను గడ్డకట్టే చలిలో ఘనంగా నిర్వహించాడు కిమ్ జాంగ్ ఉన్. ఇక ఈ వేడుకకు అటు దేశ ప్రజలందరూ కూడా హాజరు కావాలి అంటూ సూచించాడు. అంతా బాగానే ఉంది.. కానీ గడ్డకట్టే చలిలో చేతికి గ్లౌజులు టోపీలు ధరించకుండా ప్రజలు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశాడు. ఏం రక్షణ లేకుండానే గడ్డకట్టే చలిలో ప్రజలను నిలబెట్టి తన ప్రసంగాన్ని పూర్తి చేశాడు కిమ్. అయితే తాను కూర్చున్న డెస్క్ వద్ద మాత్రం చుట్టూ హీటర్లు పెట్టుకోవడం గమనార్హం. ఇక ఇది తెలిసి కింగ్ జాన్ రాక్షసత్వం రోజురోజుకీ మితిమీరి పోతుంది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Kim

సంబంధిత వార్తలు: