రూమ్ నుంచి కుళ్ళిన కంపు.. తలుపుల బద్దలుకొట్టి చూస్తే?

praveen
ఆ ఇంట్లో ఓ పెద్దావిడ ఉండేది. కానీ ఏం జరిగిందో తెలియదు కొన్నాళ్లుగా కనిపించకుండా పోయింది.  ఆ తర్వాత ఆమె ఉండే గది నుంచి కంపు వాసన వస్తుంది. కానీ ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరు ఈ వాసన గురించి గానీ ఆ పెద్దావిడ గది గురించి కానీ పట్టించుకునే సమయం లేకుండా పోయింది. రోజు ఆ ఇంటి ముందు నుంచి అటూ ఇటూ తిరుగుతున్నారు తప్ప ఎవరు ఆ పెద్దావిడ గురించి ఆలోచించలేదు. చాలాకాలం పాటు ఇలా కంపు వాసన వస్తూనే ఉంది చాలా కాలం అంటే దాదాపు రెండు సంవత్సరాలపాటు. ఇక ఇటీవలే ఏం జరిగిందా తలుపులు బద్దలు కొట్టి చూడగా అందరు షాక్.


 ఒంటరి జీవితం గడుపుతున్న ఓ పెద్దావిడ అస్తిపంజరం గా మారిపోయింది. లండన్లోని పిచ కమ్ లో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. సెయింట్ మేరీస్ రోడ్డులో ఓ మూడు అంతస్తుల భవనంలో 62 ఏళ్ల వయస్సు ఉన్న ఓ మహిళ ఒంటరిగా ఉంటుంది. గత రెండేళ్ల నుంచి ఆమె ఉంటున్న పోర్షన్ తలుపు మూసే ఉంది. ఇంటి డోర్ కి అడ్డంగా సైకిల్ కూడా పెట్టి ఉంది. దీంతో ఆ వృద్ధురాలు ఎక్కడికో వెళ్లిపోయింది అనుకున్నారు అందరు. రెండేళ్లుగా ఆ పోర్షన్ నుంచి దుర్వాసన వస్తుంది. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఇటీవలే వాసనా మరింత ఎక్కువ అవడంతో పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది ఓ యువతి. పోలీసులు వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా  పెద్దావిడ అస్తిపంజరం కూర్చున్న స్థితిలో కనిపించింది.


 దీంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అంతేకాదు ఆ గదిలో కుప్పలు కుప్పలుగా లెటర్ లు కూడా పడి ఉన్నాయి. అయితే ఈ పెద్దావిడ ఎవరు అనే విషయం మాత్రం చుట్టుపక్కల ఎవరికీ తెలియదట.  2019 అక్టోబర్ లో చివరి సారి ఆమెను చూశా అంటూ పొరుగింట్లో ఉండే ఓ యువతి చెబుతోంది.  కరోనా వైరస్ కారణంగా ఎంతోమంది తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు.. వృద్ధురాలు కూడా అలాగే వెళ్లిపోయి ఉంటుందని భావించాను  అంటూ పోలీసులకు తెలిపింది యువతి. ఈ క్రమంలోనే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు అసలు ఆ వృద్ధురాలు ఎవరు అన్న దానిపై ఆరా తీయడం మొదలు పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: