యుద్ధం వద్దు.. పుతిన్ కు షాక్ ఇచ్చిన జనం?

praveen
పొరుగు దేశమైన ఉక్రెయిన్ ను తమ స్వాధీనంలోకి తెచ్చుకునేందుకు మొన్నటి వరకూ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించిన అగ్ర  దేశమైన రష్యా ఇటీవలే మిలిటరీ యాక్షన్ అంటూ ఏకంగా ఉక్రెయిన్ పై యుద్ధానికి సిద్ధమైంది. అయితే ఇక ప్రస్తుతం వరుసగా యుద్ధ విమానాలు క్షిపణుల సహా అన్ని రకాల ఆయుధాలతో చిన్న దేశమైన ఉక్రెయిన్ పై విరుచుకు పడుతుంది. నిన్నటి వరకు సైనిక స్థావరాలపై దాడి చేసి ధ్వంసం చేసిన రష్యా ఇప్పుడు జనావాసాల్లో దాడి చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.


 అయితే చిన్న దేశమైన ఉక్రెయిన్ విషయంలో అటు బడా దేశమైన రష్యా వ్యవహరిస్తున్న తీరుపై ప్రపంచం మొత్తం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ప్రయోగించిన ట్లుగా అగ్రదేశం గా కొనసాగుతున్న రష్యా తమ తో పోలిస్తే ఆయుధాలలో సైనికులలో ఎక్కడ సరితూగని ఉక్రెయిన్ పై ఆయుధాలతో విరుచుకుపడటం ఏంటి అంటూ అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు. వెంటనే రష్యా తమ దుశ్చర్యలను ఆపివేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. రక్తపాతం సృష్టించి ఉద్దేశంతోనే రష్యా ఇలాంటి దాష్టీకానికి పాల్పడుతోంది అంటూ విమర్శలు కూడా చేస్తున్నారు.



 కేవలం ఇతర దేశాలలో ఉన్న ప్రజలు విశ్లేషకులు మాత్రమే కాదు రష్యా లోని పౌరులు సైతం ఇక రష్యా అధ్యక్షుడు పుతిన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తీవ్రస్థాయిలో నిరసన తెలుపుతున్నారు అని తెలుస్తోంది. ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగిన పుతిన్ పై సొంత దేశంలోనే వ్యతిరేకత వ్యక్తమవుతు ఉండడంతో ఊహించని షాక్ తగిలింది. పుతిన్ చర్యలపై ఆగ్రహం వ్యక్తం  చేస్తూ ఏకంగా 17 వందల మందికి పైగా నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు.  ఈ క్రమంలోనే పోలీసులు రంగంలోకి దిగి ఇలా నిరసనకారులు అందర్నీ కూడా అరెస్టు చేసి జైలుకు తరలించారనీ తెలుస్తోంది. కేవలం ఒక ప్రాంతం లోనే కాదు రష్యా వ్యాప్తంగా కూడా ఇలాంటి నిరసనలు మిన్నంటుతున్నాయి. వెంటనే యుద్ధాన్ని విరమించుకుని సైనికులను ఉపసంహరించుకోవాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు రష్యా పౌరులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: