రష్యా కు షాక్.. రంగంలోకి నాటో?
చివరికి రష్యా అనుకున్నట్టే చేసింది.. మిలటరీ యాక్షన్ పేరు చెప్పి ఏకంగా ఉక్రెయిన్ పై తీవ్రస్థాయిలో యుద్ధం చేస్తుంది. యుద్ధ విమానాలు బాలిస్టిక్ క్షిపణుల ఫైటర్ జట్లతో ప్రస్తుతం చిన్న దేశమైన ఉక్రెయిన్ పై విరుచుకు పడుతుంది. అదే సమయంలో అటు ఉక్రెయిన్ మాత్రం రష్యాకు లొంగిపోవడానికి సిద్ధపడటం లేదు. ఆ దేశ ప్రజలు ప్రస్తుతం ఆయుధాలు పట్టుకుని యుద్ధ రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కీలకమైన సైనిక స్థావరాలను ధ్వంసం చేసిన రష్యా ఆర్మీ.. ఇక ఇప్పుడు ఇక ఇప్పుడు ఉక్రెయిన్లోని కీలకమైన నగరాలను స్వాధీనం చేసు కోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.
అయితే ఉక్రెయిన్ కు అండగా ఉంటాము అంటూ చెప్పిన నాటో యూరోపియన్ యూనియన్ దళాలు ఇప్పటివరకు రంగంలోకి దిగక పోవడం గమనార్హం. ఈ విషయంపై స్పందించిన నాటో.. రష్యా దాడి అప్రజాస్వామికమ్.. అంతర్జాతీయ నిబంధనలను రష్యా ఉల్లంఘించిందని.. నాటో పేర్కొంది. ఇప్పటికే అనేక ఆంక్షలు విధించామని ఉక్రెయిన్ కు ఆర్థిక రక్షణ పరంగా కూడా అండగా ఉంటామంటూ తెలిపింది. ఉక్రెయిన్ తరపున రష్యాతో పోరాటం చేసేందుకు ఇప్పటికే 100 రైటర్ జట్లను సిద్ధం చేశామని నాటో తెలిపింది. పుతిన్ ప్రభుత్వం వెంటనే తమదళాలను ఉపసంహరించుకో వాలని అంటూ మరోసారి హెచ్చరించింది నాటో.