తప్పు చేసిన రష్యా.. ఉక్రెయిన్ కి గురి పెడితే.. జపాన్ కు తగిలింది?

praveen
రష్యా ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఇక తమ దగ్గర ఉన్న అన్ని రకాల ఆయుధాలను ఉక్రెయిన్ పై ప్రయోగిస్తూ విరుచుకుపడుతుంది. ఎక్కడికక్కడ  దారుణంగా దాడులు చేస్తూ అల్లకల్లోల పరిస్థితులు సృష్టిస్తోంది. పసికూన లాంటి ఉక్రెయిన్ పై పగ పట్టిన రష్యా దారుణం గా వ్యవహరిస్తోంది. కనీస మానవత్వం చూపించకుండా దారుణం గా వ్యవహరిస్తోంది. గత కొన్ని రోజుల నుంచి ఉక్రెయిన్లో తీవ్రస్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ రష్యా మధ్య తలెత్తిన వివాదం రానున్న రోజుల్లోఎక్కడి వరకు దారి తీస్తుంది అన్నది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.



 ప్రస్తుతం ఉక్రెయిన్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ దేశాలు మొత్తం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. రష్యా ఉక్రెయిన్ పై విరుచుకు పడుతున్న తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇక ఉక్రెయిన్లో ఇప్పటికే వరుసగా క్షిపణులను ప్రయోగిస్తూ మారణహోమం సృష్టించిన రష్యా ఇటీవలే క్షిపణి ప్రయోగం లో తప్పు చేసింది అన్నది తెలుస్తుంది.  ఉక్రెయిన్ పై ఉపయోగించిన  మిస్సైల్ జపాన్ కి సంబంధించిన షిప్ ని టార్గెట్ చేస్తూ వెళ్ళింది. ఇది కాస్త సంచలనంగా మారింది. ఇక ఈ క్రమంలోనే ఈ ఘటన ఎక్కడ వరకు దారి తీస్తుంది అన్నది కూడా ఊహకందని విధంగా మారిపోయింది.


 ఉక్రెయిన్ నల్ల సముద్రంలో ఉన్న జపాన్కు చెందిన వ్యాపార నౌకపై మిస్సైల్ దాడి జరగడం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఈ మిస్సైల్ దాడి తో కార్గో షిప్ లో ఉన్న కెమికల్ ట్యాంకర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో అందులో ఉన్న సిబ్బంది వెంటనే సముద్రంలోకి దూకి వేయడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే ఇద్దరికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. అయితే ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉన్నట్టు తెలుస్తోంది.  అయితే రష్యా ప్రయోగించిన మిస్సైల్ కారణంగానే ఇక ఈ ప్రమాదం జరిగిందని ఉక్రెయిన్ ప్రభుత్వం తెలిపింది. కాగా ఇది ఇంటర్నేషనల్ చట్టాలను ఉల్లంఘించడమే అంటూ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై జపాన్ ఎలా స్పందించబోతుంది అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: