ఉక్రెయిన్ లో ఉండిపోయిన భారతీయుడు.. కారణం తెలిస్తే షాకే?
ఈ క్రమంలోనే అన్ని దేశాల ప్రభుత్వాలు కూడా తమ దేశ పౌరులను వెనక్కు రప్పించేందుకు చర్యలు చేపడుతూ ఉండడం గమనార్హం. భారత్‌కు చెందిన పౌరులు ఇరుక్కుపోగా ఇక వాళ్ళని స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం సహా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎన్నో చర్యలు చేపడుతున్నాయి అని చెప్పాలి.. ఈ క్రమంలోనే ఇటీవల ఎయిర్ ఇండియా విమానాలను ఉక్రెయిన్ కు పంపగా ఇక ఆ విమానాలలో దాదాపు 470 మంది విద్యార్థులు తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. కానీ ఇక్కడ ఒక భారతీయుడు మాత్రం ఉక్రెయిన్ విడిచి స్వదేశానికి రావడానికి నిరాకరించాడు. ప్రస్తుతం రష్యా బాంబుల వర్షం కురిపిస్తూ ఉన్న నేపథ్యంలో ప్రజలు ఉక్రెయిన్ లో ఉండ లేక ఇతర దేశాలకు వెళ్తున్న సమయంలో భారతీయుడు మాత్రం ఉక్రెయిన్ లోనే ఉంటాను అంటూ తెగేసి చెప్పాడట.
అయితే ప్రాణాపాయం ఉన్నప్పటికీ ఉక్రెయిన్ లోనే ఉండి పోతాను అని చెప్పడానికి వెనుక ఒక పెంపుడు శునకం కారణం అనేది తెలుస్తుంది. ఉత్తరాఖండ్‌కు చెందిన రిషబ్ కౌశిక్ ప్రస్తుతం ఉక్రెయిన్‌లో ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్నాడూ. కుటుంబ సభ్యులు అయితే యుద్ధ భయం నేపథ్యంలో దుబాయ్ వెళ్లారు.. ఇటీవలే అతన్ని భారత్ తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా.. పెంపుడు శునకం ను ఒంటరిగా వదిలేసి వెళ్లేందుకు అతనికి మనసు రాలేదు. ఒకవేళ తాను లేకపోతే ఆ కుక్కకు తినిపించేవారు ఉండరని అందుకే ఇక తనతోపాటు కుక్కను తీసుకెళ్లేందుకు పర్మిషన్ కోసం ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు సదరు వ్యక్తి.