నేను రాజు.. నేను సైన్యం.. రంగంలోకి ఉక్రెయిన్ అధ్యక్షుడు?

frame నేను రాజు.. నేను సైన్యం.. రంగంలోకి ఉక్రెయిన్ అధ్యక్షుడు?

praveen
అగ్ర దేశమైన రష్యా చిన్న దేశమైన ఉక్రెయిన్ పై ఆయుధాలతో ఎంతలా విరుచుకు పడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొన్నటి వరకూ తమకు అసలు యుద్ధం చేసే ఉద్దేశమే లేదు అంటూ చెప్పిన రష్యా.. ఇక ఇప్పుడు మాత్రం ఏకంగా ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగింది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి అనే విషయం తెలిసిందే. నిన్న మొన్నటి వరకు కేవలం ఉక్రెయిన్ సైనిక స్థావరాలపై దాడి చేసిన రష్యా సైనిక స్థావరాలను ధ్వంసం చేసింది. కానీ నేటి నుంచి మాత్రం ఏకంగా జనావాసాల్లో కూడా మిస్సైల్స్  ప్రయోగిస్తూ దారుణంగా వ్యవహరిస్తుంది రష్యా. అయితే భారీగా ఆయుధ సంపత్తి కలిగిన రష్యా లాంటి దేశం యుద్ధం చేస్తున్నప్పటికీ ఎక్కడ వెనకడుగు వేయడం లేదు ఉక్రెయిన్.

 తమకున్న కొంత మంది సైన్యం తోనే రష్యా బలగాలను నిలువరిస్తూ   రష్యా కు షాక్ ఇస్తూ ఉండడం గమనార్హం. మొన్నటి వరకు  నాటో  యూరోపియన్ యూనియన్ దేశాలు ఉక్రెయిన్ కు  మద్దతు ఇస్తున్నాము అంటూ ప్రకటించినప్పటికీ తీరా యుద్ధం వచ్చేసరికి ఇక ఎలాంటి ఆయుధ సహకారం ఇవ్వకపోవడంతో ప్రస్తుతం అగ్ర దేశమైన రష్యాతో ఉక్రెయిన్ ఒంటరిగా పోరాడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అధ్యక్షుడిగా  వ్లాదిమీర్ జెనల్ స్కి తమకు ఉన్న కొంత మంది సైన్యంతో ఎక్కడ వెనకడుగు వేయడం లేదు. దీంతో పోరాటం తప్ప లొంగిపోవడం అనేది లేదు అంటూ వరుసగా స్టేట్మెంట్లు ఇస్తూ ఉండడం గమనార్హం.

 అయితే నాయకుడు అంటే కేవలం నడిపించే వాడు కాదు ఆపద వస్తే అండగా నిలబడి పోరాడేవాడు అని ఉక్రెయిన్ అధ్యక్షుడునిరూపిస్తున్నాడు.  ఇక ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల సమయంలో ముప్పేట దాడికి దిగిన రష్యా సేనలను ఎదుర్కొనేందుకు తన సైన్యంతో కలిసి తాను కూడా స్వయంగా యుద్ధరంగంలో కి దిగి పోరాడేందుకు సిద్ధమయ్యాడు దేశ అధ్యక్షుడు.  ఈ క్రమంలోనే ఆర్మీ దుస్తువులు ధరించి యుద్ధరంగంలో కీలక పాత్ర వహిస్తున్నాడూ. ఇది ఉక్రెయిన్ సేనలో ఎంతగానో ధైర్యాన్ని నింపింది. అంతేకాకుండా అధ్యక్షుడు ధైర్యానికి ప్రపంచం మొత్తం ఫిదా అయిపోతుంది. ఇక ఇలా స్వయంగా ఒక దేశ అధ్యక్షుడు రంగంలోకి దిగి పోరాటం చేయడం మాత్రంసంచలనంగా మారిపోయింది అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: