ఆల్ టైమ్ రికార్డ్.. గ్యాస్ ధర ఎంత పెరిగిందో తెలుసా?

praveen
ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ మధ్య తీవ్ర స్థాయి లో యుద్ధం జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ యుద్ధ నేపథ్యం లో ఉక్రెయిన్ లో నెలకొన్న అల్లకల్లోల పరిస్థితులు చూసి ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే రోజులు గడుస్తున్నాయి తప్ప ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం మాత్రం ఎక్కడ సద్దుమణగలేదు. రోజు రోజుకు తీవ్రస్థాయికి చేరి పోతుంది. అయితే ఈ యుద్ధం ప్రభావం కాస్త ప్రపంచ దేశాలపై ఎక్కువ గానే ఉంది అని చెప్పాలి.  ఎందుకంటే ఇక ప్రపంచ దేశాలలో యుద్ధం కారణం గా అన్ని రకాల నిత్యావసర ధరలు అంతకంతకూ పెరిగి పోతున్నాయి.


 ఇక యుద్ధం కారణంగా క్రూడాయిల్ ధరలు పెరిగిపోవడంతో అన్ని దేశాలలో పెట్రోల్ డీజిల్ ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. యుద్ధ ప్రభావం కారణంగా ఇటీవల యూరోప్లో గ్యాస్ ధర కూడా ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకోవడం గమనార్హం. అత్యధికంగా యూరోపియన్ సహజవాయువు బుధవారం 1000 క్యూబిక్ మీటర్లు అధికంగా 2200 డాలర్లకు చేరుకోవడం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. మార్కెట్ చరిత్రలోనే  ఇంత అత్యధికంగా నమోదు కావడం ఇదే తొలిసారి అంటున్నారు నిపుణులు. అయితే రష్యా ఉక్రేయిన్ మధ్య పెరుగుతున్న సంక్షోభం జరుగుతున్న యుద్ధం గ్యాస్ కొరత కి దారి తీస్తుందని నిపుణులు అంటున్నారు.


అంతే కాకుండా గ్యాస్ సరఫరాపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందనీ నిపుణులు చెబుతున్నారు.  ఈ క్రమంలోనే యూరోపియన్  సహజవాయువు ధర ఒక్కసారిగా పెరిగిపోయింది అని అంటున్నారు. అయితే నెదర్లాండ్స్లోని టి టిఎఫ్బిలో 1000 క్యూబిక్ మీటర్లకు 1500 నుంచి 2226 డాలర్లకు పెరగగా గృహ వినియోగ దానికి గంటకి ఒక మెగావాట్ 213 డాలర్లతో ఆల్ టైం రికార్డు స్థాయికి చేరడం గమనార్హం. ఈ క్రమంలోనే అక్కడి పౌరులు అందరూ కూడా పెరిగిన ధరలతో బెంబేలెత్తిపోతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Gas

సంబంధిత వార్తలు: