కన్నీరు పెడుతున్న రష్యా సైన్యం.. ఎందుకో తెలుసా?
ఇక మరోవైపు ఉక్రెయిన్ రాజధాని నగరమైన కీవ్ ను స్వాధీనం చేసుకోవాలని ఉద్దేశంతో రష్యా బలగాలు ముందుకు దూసుకు పోతూ ఉండగా ఉక్రెయిన్ సైన్యం కూడా ఎదురు నిలబడి వీరోచిత పోరాటం చేస్తోంది. ఇరు దేశాల సైన్యం మధ్య భీకర పోరు జరుగుతూ ఉండటం గమనార్హం. ఉక్రెయిన్ స్వాధీనం చేసుకోవడమే లక్ష్యం గా భారీ పేలుళ్ళు కూడా పాల్పడుతుంది రష్యా. ఈ క్రమంలోనే ఇటీవలే నగరంలోని ఒక మెట్రో స్టేషన్ సమీపంలో రెండు భారీ పేలుళ్లు జరిగినట్లు తెలుస్తోంది.
ఇక ఇలాంటి సమయంలో మరో వైపు ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రష్యన్ సైనికులు అక్కడ తమ సొంత వాహనాలను వారే ధ్వంసం చేసుకుంటున్నారు అంటూ న్యూయార్క్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఇది కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రజలపై తూటాల వర్షం కురిపించడం ఇష్టంలేక ఎంతో మంది రష్యన్ సైనికులు కన్నీరు పెట్టుకుంటున్నారని ఇక యుక్రెయిన్ తో యుద్ధాన్ని తప్పించేందుకు తమ వంతు గా వారి వాహనాలను వారే ధ్వంసం చేసుకుంటున్నారు అంటూ వార్త వైరల్ గా మారిపోయింది