పుతిన్ ను చంపితే భారీ నజరానా.. షాకింగ్ ప్రకటన?

praveen
ప్రస్తుతం ఉక్రెయిన్ రష్యా మధ్య ఎంత తీవ్రస్థాయిలో యుద్ధం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమకు ఎక్కడ సరితూగని ఉక్రెయిన్ పై అటు రష్యా విరుచుకుపడుతూ ఆయుధాలతో బీభత్సం సృష్టిస్తోంది. రోజులు గడుస్తున్నాయి తప్ప రష్యా ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు మాత్రం సద్దుమణగలేదు. దీంతో ప్రస్తుతం చిన్న దేశమైన ఉక్రెయిన్ లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. తమ దగ్గర ఉన్న అన్ని రకాల ఆయుధాలతో ఉక్రెయిన్ పై విరుచుకు పడుతుంది రష్య. ఈ క్రమంలోనే అక్కడి ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్న విషయం తెలిసిందే.


 ఏ క్షణంలో ఎటువైపు నుంచి బాంబు వచ్చి మీద పడి ప్రాణాలు పోతాయో అని భయం భయంగా బ్రతుకును  వెళ్లదీస్తున్నారు. అయితే అటు వ్యాపారవేత్తలు దేశాన్ని విడిచి వెళ్లిపోతున్నారు అనే విషయం తెలిసిందే. ఇకపోతే రష్యా ఉక్రెయిన్ పై చేస్తున్న యుద్ధాన్ని అటు ప్రపంచ దేశాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయ్. ప్రపంచ దేశాలు మాత్రమే కాదు రష్యా లో ఉన్న జనం కూడా ఉక్రెయిన్ పై యుద్ధం చేయడాన్ని అస్సలు సహించడం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్ల మీదికి చేరింది నిరసనలు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి..


 ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవలే రష్యా వ్యాపారవేత్త షాకింగ్ ప్రకటన చేశారు. ఏకంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ను చంపితే భారీ భారీ నజరానా ఇస్తాను అంటూ ప్రకటించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.ప్రస్తుతం రాజకీయ ఒత్తిళ్లతో రష్యాను విడి అమెరికాలో ఉంటున్నాడు కొనానిఖిన్. రష్యా అధ్యక్షుడు పుతిన్ ను అరెస్టు చేసిన లేదా చంపేసిన మిలియన్ డాలర్ల సొమ్మును బహుమతిగా ఇస్తాను అంటూ చెబుతున్నాడు.. ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించి వేలమంది ప్రాణాలు పోవడానికి కారణం అవుతున్నాడు అంటూ ఆరోపించాడు. ఇక తన దేశాన్ని నాజీయిజం నుంచి రక్షించాల్సిన అవసరం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: