యుద్ధం ఆపాలంటూ.. అమ్మాయిలు అర్ధనగ్న ప్రదర్శన.. ఎక్కడంటే?
వెంటనే రష్యా యుద్ధం ఆపాలంటూ ప్రపంచ దేశాలు డిమాండ్ చేస్తూ ఉండటం గమనార్హం. అంతేకాకుండా కొన్ని దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు కూడా విధిస్తూ దౌత్యపరమైన సంబంధాలను పూర్తిగా తెంచుకుంటున్నాము అంటూ ప్రకటించాయ్ కూడా. ఇలా ఎన్ని వార్నింగ్ లు ఇచ్చిన ఎన్ని నిబంధనలు విధించినా రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇక ఉక్రెయిన్ రష్యా యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది. ఈ నేపథ్యంలో యుద్ధం ఆపాలంటూ ప్రస్తుతం ప్రపంచ దేశాల నుండి ఒత్తిడి మరింత పెరిగిపోయింది.
కేవలం ఆయా దేశాల ప్రభుత్వాలే కాదు ప్రజలు సైతం రష్యా పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలుపుతున్నారు. ఇక ఇటీవలే స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ లో విమెన్ అనే మహిళా సంఘం వాలంటీర్లు రష్యా ఎంబసీ కార్యాలయం వద్ద అర్ధనగ్న ప్రదర్శన తో తమ ఆందోళన వ్యక్తం చేశారు. తమ పై దుస్తులు విప్పి ఛాతీపై యుద్దాన్ని ఆపు అంటూ రాసుకుని డిమాండ్ చేశారు. ఇలా యుద్ధాన్ని ఆపాలంటూ అర్ధనగ్న ప్రదర్శన చేయడం మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. గతంలో సెక్స్ టూరిజం ఆపాలంటూ ఇక ఈ సంఘంలో ఉన్న మహిళలు అచ్చం ఇలాంటి తరహా అర్ధనగ్న ప్రదర్శన చేయడం హాట్ టాపిక్ గా మారిపోయింది అనే విషయం తెలిసిందే.