మనవడిని చంపిన తాత.. కోర్టు షాకింగ్ తీర్పు?
సాధారణంగా మనవడిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు తాత. పొరపాటున తల్లిదండ్రులు కోపంతో మందలించినా దగ్గరికి తీసుకుని ఓదారుస్తూ ఉంటాడు. ఎక్కడ ఒక వ్యక్తి మాత్రం మనవడి పాలిట యమకింకరుడు గా మారిపోయాడు. తండ్రి చనిపోవడంతో కొడుకు అలెక్స్ హరీ తాత జెమ్స్ సస్సేర్ వద్దకు వచ్చి ఉంటున్నాడు. అయితే ఈ సమయంలో భార్య పాట్రీసియా కు విడాకులు ఇచ్చేందుకు జెమ్స్ సస్సేర్ సిద్ధమవుతున్నాడు. అయితే విడాకులు సమయంలో మనవడిని చూసే అవకాశం ఇవ్వను అంటూ జెమ్స్ సస్సేర్ భార్య బెదిరించడంతో కాస్త వెనక్కి తగ్గాడు.
అయితే మనవడు అలెక్స్ కుటుంబసభ్యుల మాట వినడం లేదు అంటూ పాట్రీసియా జెమ్స్ సస్సేర్ కు చెప్పడంతో అతడిపై తాత ద్వేషం పెంచుకున్నాడు అప్పటినుంచి అతనిపై వేధింపులకు పాల్పడడం మొదలుపెట్టాడు. ఇక రెండేళ్లపాటు అలెక్స్ ను దారుణంగా మానసికంగా శారీరకంగా హింసించాడు. కనీసం ఆహారం కూడా సరిగా పెట్టేవాళ్లు కాదు. ఇక చివరికి 2020 ఫిబ్రవరి లో అలెక్స్ హారి చనిపోయాడు. అంతకుముందు అతడిని తీవ్రంగా కొట్టినట్లు విచారణలో వెల్లడైంది. అయితే అభం శుభం తెలియని బాలుడికి రక్షణ కల్పించాల్సిన కుటుంబ సభ్యులు హింసించడం పై విచారణలో జడ్జి సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో జెమ్స్ సస్సేర్ కు 100 ఏళ్ళు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.