అమెరికాకి కిమ్ షాక్.. అది ఓపెన్ గా చెప్పేశాడు?
ఇక కిమ్ జాంగ్ ఉన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభం రోజురోజుకు పెరిగిపోతున్నప్పటికీ కూడా ఇక ప్రజల ఆకలి కేకలు వింటూనే మరోవైపు ఏకంగా క్షిపణుల ప్రయోగానికి సిద్ధమయ్యారు కిమ్ జాంగ్ ఉన్. ఇక వరుసగా క్షిపణులను ప్రయోగించడం లాంటివి చేయడంతో అమెరికా ఎన్ని రోజులనుంచి వార్నింగులు కూడా ఇస్తూ వస్తోంది. ఇటీవలే రష్యా ఉక్రేయిన్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అదంతా నాకు సంబంధం లేదు నా దారి రహదారి అనే విధంగా మరోసారి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశాడు.
మరీ ముఖ్యంగా తన క్షిపణి ప్రయోగాలతో అగ్రరాజ్యమైన అమెరికా కి సవాల్ విసురుతూ ఉంటారు. ఇక ఇటీవలే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఇచ్చిన స్టేట్ మెంట్ మాత్రం ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. అమెరికా సహా అమెరికా మిత్ర దేశాల కదలికలను ఎప్పటికప్పుడు గమనించడానికి ప్రత్యేకమైన సాటిలైట్స్ ని పంపిస్తున్నాను అంటూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ప్రకటించారు. ఇది కాస్తా సంచలనంగా మారిపోయింది. అమెరికన్ రెచ్చగొట్టేందుకే కిమ్ ఇలాంటివి చేస్తున్నాడు అని విశ్లేషకులు అంటున్నారు..