పరువు పోగొట్టుకున్న పాక్.. అసలేం జరిగిందంటే?
ఇక ఇలా భారత మిస్సైల్ పాకిస్తాన్ భూభాగంలో పడిన ఘటనలో కొన్ని నివాస ప్రాంతాలు ధ్వంసం అయ్యాయి. కానీ ఎలాంటి ప్రాణ నష్టం మాత్రం జరగలేదనే చెప్పాలి. అయితే సాంకేతిక లోపం కారణంగానే ఇలాంటి ఘటన జరిగిందని దీనికి చింతిస్తున్నాము అంటూ కేంద్ర రక్షణ శాఖ ప్రకటించింది. ప్రతి విషయాన్ని చూసీచూడనట్లుగా ఊరుకునే ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఇక ఇదే విషయంలో మాత్రం పెద్ద రచ్చ చేసింది. పొరపాటున అటువైపుగా మిస్సైల్ దూసుకొచ్చింది అని వివరణ ఇచ్చినా సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య విభేదాలు మరోసారి తారా స్థాయికి చేరుకున్నాయి.
ఇకపోతే భారత్ కు పోటీగా ఇటీవలే తమ సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు పాకిస్థాన్ క్షిపణుల ప్రయోగం చేపట్టింది. కానీ అది విఫలం అయింది. దీంతో ఇక ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ పరువు ప్రపంచ దేశాల ముందు గంగలో కలిసిపోయింది. సింధు ప్రావిన్స్లోని జంషెడ్పూర్ ప్రాంతంలో గుర్తుతెలియని వస్తువు గాల్లోకి ఎగిరి కిందపడిపోయింది. అది వస్తువు కాదు మిస్సైల్ అని అన్నది తర్వాత తేలింది. ఇలా భారత్ కంటే తాము ఎక్కడ తక్కువ కాదు అని క్షిపణిని ప్రయోగించిన పాకిస్తాన్ చివరికి ఆ క్షిపణి కుప్పకూలి పోవడం తో చివరికి పరువు పోగొట్టుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది.