భారత్ పై ప్రశంసలు కురిపించిన ఇమ్రాన్ ఖాన్.. ఇది మొదటిసారి?

praveen
దాయాది దేశమైన పాకిస్థాన్ ఎప్పుడు భారత్ పై విమర్శలు చేస్తూనే ఉంటుంది. ఛాన్స్ ఎప్పుడు దొరుకుతుందా అని ఏకంగా వెయ్యి కళ్ళతో వేచి చూస్తూ ఉంటుంది.. కొన్నిసార్లు చాన్సు దొరకక పోయినా అనవసరమైన విమర్శలు చేస్తూ అబాసుపాలు  అవుతూ ఉంటుంది పాకిస్తాన్. అంతేకాదు భారత్ కంటే మేము ఎంతో గొప్ప భారత్ మా ముందు ఏ విషయంలోనూ సాటి రాదంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది పాక్ అనే విషయం తెలిసిందే. ఇప్పుడు వరకు ఇలా పాకిస్తాన్ ప్రభుత్వం భారత్ పై ఎన్నో విమర్శలు చేయడం చూసాము. కానీ మొదటిసారి ప్రశంసలు కురిపించడం కూడా జరిగింది అన్న విషయం తెలిసి అందరూ షాక్ లో మునిగి పోతున్నారు..


 దాయాది దేశమైన పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ భారత్ పై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ప్రస్తుతం పాకిస్థాన్లో పదవి కోల్పోయెందుకు సిద్ధంగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు భారత్ ను పొగుడుతూ వ్యాఖ్యలు చేయడం మాత్రం ప్రపంచవ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రస్తుతం పాకిస్తాన్ పార్లమెంట్ లో ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల భారత దేశ విదేశాంగ విధానాన్ని పొగడ్తలతో ముంచెత్తాడు. భారత దేశ విదేశాంగ విధానం భేష్ అనీ.. దేశ తమ పౌరుల కోసం భారత్కు ఎంతవరకైనా వెళ్తుందని చెప్పుకొచ్చాడు.



 ఇక ప్రభుత్వంలో ఇండియన్ ఆర్మీ జోక్యం చేసుకోదని.. భారత ఆర్మీ పై కూడా ప్రశంసలు కురిపించాడు. పాకిస్తాన్ ఆర్మీ కి డబ్బులు ఇచ్చి ప్రభుత్వానికి కాపాడుకో లేము అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఇమ్రాన్ ఖాన్. ప్రతిపక్షాలు  ఎన్ని కుట్రలు చేసినా లొంగే ప్రసక్తేలేదని రాజీనామాకు సిద్ధం గా ఉన్నాను అంటూ ఇమ్రాన్ఖాన్ చెప్పుకొచ్చాడు. అయితే ఇస్లామిక్ దేశాల సదస్సు తర్వాత ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేయాలని పాకిస్థాన్ ఆర్మీ అల్టిమేటం జారీ చేసింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: