ఇజ్రాయిల్ వణికిపోతుంది.. ఎందుకో తెలుసా?

praveen
ఇజ్రాయిల్.. పేరుకి చాలా చిన్న దేశం కానీ తమ దేశ రక్షణ విషయంలో మాత్రం ఏకంగా అగ్ర దేశాలకు సైతం  వణుకు పుట్టించే ధైర్యం ఉన్న దేశం. తమ దేశ భద్రతకు భంగం కలుగుతుంది అని భావిస్తే ఎక్కడ వెనకడుగు వేయకుండా ఎలాంటి పని చేయడానికి అయినా సిద్ధమవుతుంది. ప్రపంచంలో ఏ దేశానికి లేనంత బలమైన ఇంటెలిజెన్స్ విభాగం ఇజ్రాయిల్ సొంతం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతే కాకుండా ఇక ఇజ్రాయిల్ ఒక క్రైసిస్ మేనేజ్మెంట్ దేశం అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే తమ దేశానికి ఎదురయ్యే సంక్షోభాలను ముందుగానే గుర్తించి ఇక సంక్షోభాలు రాకుండా ముందుగానే జాగ్రత్త పడుతూ ఉంటుంది ఇజ్రాయిల్.

 మొన్నటికి మొన్న హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయిల్ పై క్షిపణి తో దాడికి పాల్పడిన నేపథ్యంలో ఇక ఇజ్రాయిల్ రాడార్ వ్యవస్థ ఎంతో సమర్థవంతంగా శత్రు దేశాల క్షిపణులను ఎదుర్కొంది అన్నది ప్రపంచ దేశాలు మొత్తం చర్చించుకున్నాయి. ఇలా క్రైసిస్ మేనేజర్ గా పిలుచుకునే ఇజ్రాయిల్ లో ప్రస్తుతం మాత్రం పెను సంక్షోభంలో ఎదురైంది అన్నది ప్రపంచవ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారి పోతుంది అని చెప్పాలి. ఎందుకంటే ఇజ్రాయిల్ లో వెలుగులోకి వస్తున్న వరుస దాడులు ఇక ఆ దేశ భద్రతకే భంగం వాటిల్లే విధంగా ఉన్నాయి అని తెలుస్తుంది.

 ఇటీవలి కాలంలో కొంతమంది వ్యక్తులు తుపాకులు పట్టుకుని రోడ్ల మీదికి రావడం ఇక కనిపించిన జనాలను దారుణంగా కాల్చడం ఇక సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇలా తుపాకులతో హల్ చల్ చేస్తున్న వ్యక్తులను కాల్చివేయడం చేస్తున్నారు. అయితే నిందితులు చనిపోయినప్పటికీ సామాన్య ప్రజలు కూడా ఈ ఘటనలో ఎంతోమంది చనిపోతున్నారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఇలాంటి ఘటనలు మూడు సార్లు జరిగాయి. అయితే ఇక ఇజ్రాయిల్  ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద ఛాలెంజ్ గా మారిపోయింది. ఎవరు ఇదంతా చేస్తున్నారని కనుక్కునే పనిలో పడిపోయింది ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: