షాకీచ్చిన కిమ్.. 35 నిమిషాల్లో 8 క్షిపణి పరీక్షలు?

praveen
ప్రపంచ మొత్తం ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగుతోంది అన్న విషయం తెలిసిందే. ఇక ప్రజల కోసం ఎలక్షన్లలో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు  పాలన సాగిస్తూ ఉంటారు. కానీ ఉత్తర కొరియాలో మాత్రం ప్రస్తుతం కాదు ఎన్నో ఏళ్ల నుంచి కూడా నియంత పాలన సాగుతూ వస్తోంది. ప్రస్తుతం ఉత్తర కొరియా అధ్యక్షుడిగా ఉన్న కిమ్ జాంగ్ ఉన్ తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడూ ప్రపంచవ్యాప్తంగా సంచలనం గా మారిపోతూ ఉంటాయి. ఇక ఉత్తర కొరియా లో ఎన్నికలు ఉండవు ప్రజలకు ఓటు హక్కు ఉండదు.

 బ్రతికున్నంత కాలం కిమ్ జాంగ్ ఉన్ ఉత్తరకొరియా అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉంటాడు అని చెప్పాలి. అయితే ప్రపంచం మొత్తం ఒక వైపు నడుస్తూ ఉంటే అటు కిమ్ జాంగ్ ఉన్ మాత్రం మరో వైపు నడుస్తూ ఉంటారు. నా దారి రహదారి అనే రేంజ్ లో  వ్యవహరిస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఇక ఇటీవల కాలంలో అటు ఉత్తర కొరియాల్లొ తీవ్ర స్థాయిలో ఆహార సంక్షోభం ఏర్పడింది.  అక్కడి ప్రజలందరూ కూడా తిండి దొరక్క అల్లాడిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలోదేశంలో ఆహార సంక్షోభాన్ని తీర్చాల్సిన అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్.. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి వరుసగా క్షిపణుల కు సంబంధించిన ప్రయోగాలు చేస్తూ ఉండడం సంచలనంగా మారింది.

 ఈ క్రమం లోనే అగ్రరాజ్యమైన అమెరికా ఎన్ని హెచ్చరికలు చేసినా కిమ్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు అన్నది తెలుస్తుంది.ఇటీవల రాజధాని ప్యాంగాంగ్  సమీపంలో 35 నిమిషాల వ్యవధిలోనే ఏకంగా ఎనిమిది బాలిస్టిక్ మిసైల్స్ కి  పరీక్షలు నిర్వహించడం ప్రస్తుతం సంచలనంగా  మారిపోయింది. త్వరలోనే మళ్లీ అణు పరీక్షలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై చర్చించటానికి జాతీయ భద్రత మండలి సమావేశం నిర్వహించబోతున్నారట. ఇదే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Kim

సంబంధిత వార్తలు: