వామ్మో.. ఆమెకు అంత్యక్రియలంటే తెగ ఇష్టమట?
కానీ ఇక్కడ మాత్రం ఒక మహిళ ఇలాంటి కోవకు చెందినదే అన్నది తెలుస్తుంది. అయితే సినిమాలో చూపించినట్లుగా ఏకంగా అందరిని చంపడం చంపిన తర్వాత ఏడుస్తూ ఉంటే ఆనందపడటం చేయలేదు. కానీ అంత్యక్రియలకు వెళ్లడం అంటే మాత్రం ఆమెకు ఎంతో ఇష్టమట. ఒకప్పుడైతే చివరి చూపు కోసం అంత్యక్రియలకు హాజరు కావడానికి అందరూ ఇష్టపడేవారు. కానీ ఇటీవల కాలంలో కరోనా వైరస్ సమయం తర్వాత మాత్రం ఇక అంత్యక్రియలు వెళ్లడానికి ఎంతో మంది భయపడిపోతున్నారు అని చెప్పాలి.
సొంత వారి అంత్యక్రియలను సైతం వీడియో కాల్ ద్వారా జరిపిస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి ఆధునిక సమాజంలో కూడా లండన్ కు చెందిన ఒక మహిళ మాత్రం అంత్యక్రియలకు వెళ్లడమే పనిగా పెట్టుకుంది. ఆమె పేరు జిన్ ట్రెండ్ హిల్. అయితే చిన్నప్పటి నుంచి ఇలా అంత్యక్రియలకు వెళ్లడం అంటే ఆమెకు ఎంతో ఇష్టమట. ఇక ఇప్పటివరకు ఏకంగా 200 మంది అంత్యక్రియలకు హాజరైందట ఈ మహిళ. ఇక ఈ మహిళ గురించి చెబుతూ ఉంటే అందరికీ మహేష్ బాబు సినిమాలోని సన్నివేశాలే గుర్తుకు వస్తున్నాయి కదా.