పెళ్లికి వెళ్తున్నారు.. అంతలో పిడుగు పడింది.. చివరికి?
ఇలా ఎక్కడ లేనంత ఆనందం అటు బంధువుల ముఖాల్లో.. వధూవరుల చిరునవ్వులో కనిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఇలా పెళ్లి వేడుక ఎక్కడ చూసినా ఆనందంగానే ఉంటుంది. కానీ ఇక్కడ పెళ్లి 17 మంది ప్రాణాలు పోవడానికి కారణమైంది.. ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది.. అనుకోని ఘటన ఏకంగా 17 మందిని మృత్యువు ఒడిలోకి నెట్టింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పెళ్లికి హాజరయ్యేందుకు వెళుతున్న బంధువులను వర్షం అడ్డుకోవాలని ప్రయత్నించింది. కానీ వారు అలాగేముందుకు వెళ్లడంతో పిడుగు రూపంలో చివరికి ప్రాణాలు తీసేసింది.
బంగ్లాదేశ్ లోని షిబ్ గంజ్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. షిబ్ గంజ్ నగరం నుంచి పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు నదిలో ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా వర్షం మొదలైంది. దీంతో ఏం జరుగుతుందో అని అందరూ భయపడుతూనే ఉన్నారు.. అంతలో ఒక్కసారిగా పిడుగుపాటుకు గురయ్యారు. దీంతో 17 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు అని చెప్పాలి. ఇలా గాయపడ్డ వారిలో వరుడు కూడా ఉన్నాడు అన్నది తెలుస్తుంది. అయితే బంగ్లాదేశ్ లో అడవులు ఎక్కువగా ఉండటం వల్లే పిడుగులు ఎక్కువగా పడుతున్నాయని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. ఏదేమైనా పిడుగుపాటుతో పెళ్ళంట విషాదం నెలకొంది అని చెప్పాలి.