భార్య మీద ప్రేమతో.. ఎవరు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన భర్త?
ఈ క్రమంలోనే కొంతమంది ఇచ్చే గిఫ్టులు కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి. ముఖ్యంగా కొంతమంది భర్తలు తమ భార్యలకు చంద్రమండలంపై ఒక ఫ్లాట్ కొనుగోలు చేసి బహుమతిగా ఇవ్వడం లాంటి ఘటనలు ఇప్పటికే సోషల్ మీడియాను ఊపేసి అందరిని అవ్వాక్కయ్యేలా చేసాయి. ఇక్కడొక భర్త మాత్రం ఎవరు ఇవ్వని బహుమతి ఇచ్చి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాడు. భార్యకు ప్రేమతో గాడిదను గిఫ్ట్ గా ఇచ్చాడు. గాడిదని గిఫ్ట్ ఇవ్వడం ఏంటి ఇది విచిత్రంగా ఉంది అనుకుంటున్నారు కదా.
భారత పొరుగు దేశమైన పాకిస్తాన్ లో ఇది నిజంగానే జరిగింది. పాకిస్తాన్ కు చెందిన ఆజ్లాన్ అనే వ్యక్తి పెళ్లి తర్వాత భార్య వారీషాకు ఒక గాడిద పిల్లను బహుమతిగా ఇచ్చాడు. తనకు గాడిదలు అంటే ఎంతో ఇష్టమని ఎందుకంటే అవి ప్రపంచంలో అత్యంత కష్టపడి ప్రేమగా ఉండే జంతువులు అంటూ ఆజ్లాన్ చెప్పుకొచ్చాడు. తాను పెళ్లి చేసుకున్న యువతి వారిషా జంతు ప్రేమికురాలు అని.. అందుకే ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. గాడిదను బహుమతిగా ఇవ్వడంతో భార్య ఎంతో సంతోష పడింది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక భార్యాభర్తలు ఇద్దరు కలిసి గాడిదతో దిగిన ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.