ప్రపంచం న్యూఇయర్ వేడుకల్లో ఉంటే.. నియంత కిమ్ మాత్రం?
ప్రపంచ దేశాల లో ఎక్కడ చూసినా బాణ సంచాల మెరుపులు, డీజే మోతలు, కేక్ కటింగ్ లు సంబరాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇలా ప్రపంచం మొత్తం కొత్త సంవత్సరం వేడుకల లో మునిగి పోయిన సమయం లో అటు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ వన్ మాత్రం నూతన సంవత్సరానికి ఎంతో విభిన్నం గా స్వాగతం పలికాడు అని చెప్పాలి.
అన్ని దేశాలలో అర్థరాత్రి 12 గంటలకు వీధుల్లోకి వచ్చి బాణాసంచా వెలిగించి కేక్ కట్ చేసి కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటే.. అటు నియంత కిమ్ మాత్రం నా రూటే సపరేటు అన్న విధం గా తెల్లవారు జామున 2:50 గంటలకు నిప్పులు విరజిమ్మేలా ఒక బాలిస్టిక్ క్షిపణిని ఆకాశంలోకి వదిలాడు. కొత్త ఏడాది తొలి రోజున బాలిస్టిక్ క్షిపణిని ఉత్తరకొరియా ప్రయోగించినట్లు ఇటీవల అక్కడి సైన్యం వెల్లడించింది. ఇక ఈ విషయం తెలిసి ప్రపంచ ప్రజానీకం అగ్రహం చేస్తూ ఉండడం గమనార్హం. ఇది ముమ్మాటికి ప్రపంచ శాంతిభద్రతలకు విఘాతం కలిగించినట్లే అంటూ అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే గత కొంతకాలం నుంచి కిమ్ ఇలా వరుసగా క్షిపని ప్రయోగాలు జరుపుతూనే ఉన్నాడు. అన్న విషయం తెలిసింది అగ్రరాజ్యమైన అమెరికా హెచ్చరించినప్పటికీవెనక్కి తగ్గడం లేదు.