ఏంటి.. భోజనానికి రూ.లక్షా.. పాపం విద్యార్థులు?

praveen


ఒక్కొచోట ఒక్కొ రకంగా ఫుడ్ పదార్థాల ధరలు ఉంటాయి. మెయింటనెన్స్, క్వాలిటీని బట్టి ధరలు నిర్ణయిస్తారు. రోడ్డు మీద బండి మీద తినే ఆహారానికి ఒక రేటు ఉంటుంది. అలాగే పెద్ద పెద్ద హోటళ్లు, స్టార్ హోటళ్లల్లో తినే ఆహార పదార్థాలకు ఎక్కువ రేటు చెల్లించాల్సి ఉంటుంది. సదుపాయాలు, టేస్ట్, క్వాలిటీని బట్టి ధరలు మారుతూ ఉంటాయి. అందుకే ఎక్కడికైనా తినడానికి వెళ్లినప్పుడు ధరల గురించి అవగాహన కలిగి ఉండటమనేది చాలా మంచిది. మన దేశం లోని రెస్టారెంట్ల లోని ఆహార పదార్థాల ధరలు, ఇతర దేశాల రెస్టారెంట్ల లోకి ధరలకు భారీ వ్యత్యాసం ఉంటుంది.

ఇటీవల ఇటలీ పర్యటనకు వెళ్లిన కొంత మంది అక్కడి రెస్టారెంట్ల లోని ధరలను చూసి షాక్ అయ్యారు. 2018లో జపనీస్ విద్యార్థుల బృందం ఇటలీ పర్యటనకు వెళ్లింది. సెయింట్ మార్క్స్ స్క్వేర్ సమీపం లోని ఓస్టెరియా డి లూకా రెస్టారెంట్‌ కి వెళ్లారు. ఆ రెస్టారెంట్‌ లో భోజనం కోసం రూ.99,520 చెల్లించాల్సి వచ్చింది. కేవలం నాలుగు స్టీక్స్, ఒక ప్లపేట్ ఫ్రైడ్ పిష్, వాటర్ మాత్రమే వాళ్లు తీసుకున్నారు. దానికి రూ.99,520 బిల్లు రావడం తో ఒక్కసారిగా ఆశ్చర్య పోయారు. ఇదేంటని రెస్టారెంట్ సిబ్బందిని ప్రశ్నించారు. దీంతో తమ రెస్టారెంట్‌ లో ఇలాగే ధరలు ఉంటాయని సిబ్బంది సమాధానమిచ్చారు. ఆ రెస్టారెంట్‌లో హాట్‌స్పాట్ ఉపయోగించుకున్నందుకు కూడా బిల్లు వేశారు.

విద్యార్ధులు రెస్టారెంట్ బిల్లుపై స్థానిక అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు లో అధిక బిల్లులకు వసూలు చేసినందుకు రెస్టారెంట్ కు భారీగా జరిమానా విధించారు. గతం లోనూ ఒక ఇటాలియన్ టూరిస్ట్‌కు రెండు కాఫీలు, రెండు వాటర్ బాటిళ్లు తీసుకున్నందుకు రూ.3,796 బిల్లు వేశారు. ఇక ఒక బ్రిటిష్ టూరిస్ట్ ఒక రెస్టారెంట్‌లో లాబ్ స్టెర్ ఆయిస్టెర్స్ తిన్నందుకు రూ.47,502 బిల్లు వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: