తండ్రి మరణం తట్టుకోలేకపోయిన చిన్నారి.. సమాధి దగ్గరికి వెళ్లి?
ఇలా అల్లారు ముద్దుగా చూసుకున్న తండ్రి ఇక లేడు అన్న విషయం తెలిస్తే ఆ కూతురు గుండె ఆగిపోయినంత పని అవుతుంది. ఇక్కడ ఏడేళ్ల వయసులోనే ఆ బాలికకు ఇంతటి కొండంత బాధను భరించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇక తండ్రి మరణాన్ని తట్టుకోలేకపోయిన కూతురు తండ్రి సమాధి దగ్గరికి వెళ్లి కథలు వినిపించడం చేస్తూ ఉంది. ఈ ఘటన చైనాలోనే కెనాన్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. ఆ బాలిక పేరు లీన్ లి. బాలిక తండ్రి గత ఏడాది చేపలు పడుతూ నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. అయితే తండ్రి మరణాన్ని చిన్నారి హృదయం తట్టుకోలేకపోయింది.
ఈ క్రమంలోనే ఆ బాలిక తన అత్తతో గత రాత్రి తనకు తండ్రి కనిపించాడు అని తెలిపింది. తర్వాత రోజు తనను తండ్రి సమాధి దగ్గరకు తీసుకువెళ్లాలి అంటూ మొండి పట్టు పట్టింది. ఇలా తండ్రి సమాధి దగ్గరికి తీసుకువెళ్లిన తర్వాత ఏకంగా తండ్రి సమాధి వద్ద కూర్చొని హాయిగా తండ్రితో కథలు చెబుతూ గడిపింది ఆ చిన్నారి. అయితే ఆ చిన్నారి తల్లి కూడా ఆమెను వదిలేసి ఎప్పుడో వెళ్లిపోయింది. ఇక ఇప్పుడూ తండ్రి చనిపోవడం తల్లి వదిలేయడంతో చిన్నారి అనాధగా మారింది. దీంతో ఇక ఆమె అత్త ఒక వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆమె ఎవరైనా సహాయం చేస్తారేమో అని భావిస్తోంది.