ఓరి నాయనో.. 2 కిలోమీటర్ల ఉబర్ రైడ్ కి రూ. 24 లక్షల బిల్లు?
ఇలాంటి సర్వీస్ లను అందించేందుకు ఓలా, ఉబర్, రాపిడో అంటూ ఎన్నో రకాల కంపెనీలు పోటీపడుతున్నాయి అన్న విషయం తెలిసిందే. దీంతో అతి తక్కువ ధరలకే ప్రస్తుతం ఎంతో నాణ్యతతో కూడిన సర్వీసులు పొందగలుగుతున్నారూ జనాలు. దీంతో ప్రస్తుతం ఎక్కడికైనా వెళ్లాలి అంటే సొంతంగా వాహనం ఉండాల్సిన పనిలేదు. అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో ఒక్క క్లిక్ ఇస్తే చాలు ఇంటి ముంగిట్లో రిసీవ్ చేసుకుని ఇక గమ్యస్థానానికి చేర్చే సర్వీస్ లు అందుబాటులో ఉన్నాయి. అయితే కొన్ని కొన్ని సార్లు మాత్రం ఇలాంటి సర్వీస్ ల ద్వారా కస్టమర్లకు ఊహించని చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి అని చెప్పాలి.
ఇక యూఎస్ లో కూడా ఒక జంటకు ఉబర్ ఇలాంటి షాక్ కి ఇచ్చింది. కాస్త దూరం ప్రయాణానికి ఏకంగా 24 లక్షల రూపాయల బిల్లు ఛార్జ్ వేసింది ఉబర్. ఐదవ వివాహ వార్షికోత్సవ వేడుకల్లో ఉన్న జంట తర్వాత రోజు కాఫీ షాప్ వెళ్ళింది. దీనికోసం ఉబర్ క్యాబ్ బుక్ చేసుకుంది. ఇక ఆ తర్వాత రెస్టారెంట్లో పేమెంట్ చేయాలి అనుకుంది. కానీ అకౌంట్లో మాత్రం డబ్బులు లేవు అనే విషయాన్ని గుర్తించింది. అయితే అకౌంట్లో ఉన్న లక్షల రూపాయలు ఏమయ్యాయి అని చెక్ చేస్తే అసలు విషయం తెలిసి ఒక్కసారిగా షాక్ అయింది ఆ జంట. వెంటనే ఉబర్‌కు ఫిర్యాదు చేశారు. ఎందుకంటే ఆమె అకౌంట్లో నుంచి 29,994 డాలర్లు కట్ అయ్యాయి అంటే భారత కరెన్సీలో 24 లక్షలు. ఈ విషయంపై స్పందించిన ఉబర్ ఇక అమౌంట్ రిఫండ్ చేస్తాము అంటూ హామీ ఇచ్చింది.