ప్రేమలో పడిన 83 ఏళ్ల వృద్ధురాలు.. చివరికి ఏం చేసిందంటే?
ఈ క్రమంలోనే ఒకప్పుడు ఎవరైనా అబ్బాయి తనకంటే పెద్ద వయస్సు కలిగిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే హాట్ టాపిక్ గా మారేది. కానీ ఇప్పుడు మాత్రం ఇలాంటి ఘటనలు కామన్ గా మారిపోయాయి అని చెప్పాలి. ఇలాంటి వివాహానికి సంబంధించిన ఒక వార్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఆమె వయసు 83 ఏళ్లు ఆ వయసులో ఎవరైనా సరే కృష్ణ రామా అంటూ మనవళ్ళు మనవరాల్లతో ఆడుకోవడం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ 83 ఏళ్ల వృద్ధురాలు అలా చేయలేదు. ఏకంగా వృద్ధాప్యంలో ఆమెకు పెళ్లి కోరిక కలిగింది.
సరే పోనీలే 83 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవాలి అనుకుంది. ఇక తన వయస్సు ఉండే వృద్ధుడిని చూసుకుని పెళ్లి చేసుకుంది అనుకుంటే పొరపాటే. ఏకంగా 37 ఏళ్ల వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది 83 ఏళ్ల మహిళ. ఇది మన దేశంలో కాదు బ్రిటన్ లో వెలుగులోకి వచ్చింది ఐరిష్ జోన్స్ అనే 83 ఏళ్ల మహిళలకు ఫేస్బుక్లో ఈజిప్టు వాసి ఇబ్రహీం అనే 37 ఏళ్ల వ్యక్తితో పరిచయం ఏర్పడింది ఇక కొన్నాళ్లకే వీరి పరిచయం ప్రేమగా మారింది. 2020లో పెళ్లి చేసుకొని ఈజిప్టులోనే కాపురం పెట్టారు ఈ జంట. కానీ రెండేళ్లకి మనస్పర్ధలు రావడంతో చివరికి విడిపోయారు. ఇక ప్రస్తుతం ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి ఒక పిల్లిని పెంచుకుంటున్నాను అంటూ సదరు మహిళ చెప్పుకొచ్చింది.