ఏం ఆర్డర్ చేయలేదు.. కానీ వందల పార్సిల్స్ వచ్చాయి?

praveen
ఇటీవల కాలం లో అధునాతన టెక్నాలజీ మనిషికి అందుబాటు లోకి వచ్చిన నేపద్యం లో ప్రతి విషయం కూడా ఎంతో సులభతరంగా మారి పోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం  లోనే కావాల్సిన వస్తువు కోసం ఆహారం కోసం బయటికి వెళ్లాల్సిన పని లేకుండా పోయింది. ఎందుకంటే ఇక ప్రతి ఒక్కరికి కూడా కూర్చున్న చోటుకే అని వస్తువులు తీసుకొచ్చేందుకు ఎన్నో రకాల సర్వీసులు అందుబాటు  లో ఉన్నాయని చెప్పాలి.


 ఈ క్రమం లోనే  ఈ టెక్నాలజీకి బాగా అలవాటు పడి పోయిన మనిషి.. స్మార్ట్ ఫోన్లో ఒక్క క్లిక్ ఇవ్వడం ద్వారా కావాల్సిన వస్తువులు ఇంటి ముంగిటికీ తెచ్చుకోగలుగుతున్నాడు. వేసుకునే చెప్పుల దగ్గర నుంచి తినే ఆహారం వరకు అన్నీ కూడా ఇలా సులభతరం గానే పొందగలుగుతున్నాడు అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో అటు ఆర్డర్ చేసిన వస్తువు ఆలస్యంగా డెలివరీ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇలాంటి సమయం లో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయని చెప్పాలి. కానీ ఇక్కడమాత్రం ఒక విచిత్రమైన కర్ర ఘటన జరిగింది. సాధారణం గానే ఆర్డర్ చేసిన వస్తువు డెలివరీ లేట్ అవుతే ఇక్కడ మాత్రం ఆర్డర్ చేయకుండానే వస్తువు డెలివరీ అయింది.


 ఈ ఘటన అమెరికా లో వెలుగు లోకి వచ్చింది. ఒక మహిళకు ఏమీ ఆర్డర్ చేయకుండానే వందకు పైగా అమెజాన్ లిక్సియావో జాంగ్ పేరిట ఉన్న పెట్టెలు  సిండిస్మిత్ ఇంటికి చేరాయి. ఆ బాక్సుల్లో 1000 హెడ్ లాంప్స్, 800 బ్లూ గన్స్, బైనాక్యులర్స్ ఉన్నాయి అని చెప్పాలి. ఫెడెక్స్ నుంచి కొన్ని పార్సిల్లు  అందాయని ఆమె పేర్కొన్నారు. అయితే వాటిని ఏం చేయాలో తెలియక.. తెలిసినా తెలియని వారికి అన్నీపంచి పెట్టినట్లు సదర మహిళా చెప్పుకొచ్చింది. ఇలా ఆర్డర్ చేయకుండానే పార్సిల్ రావడం మాత్రం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: