వలస బతుకులు.. ఎంత కష్టం ఎంత కష్టం?
వలస బతుకుల్లో యూరప్ దేశాల్లో చాలా మంది సెటిల్ అవుతున్నారు. సంపాదించాలనుకునే వారు బంధాలు, అప్యాయతల వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదని అనుకుంటున్నారు. ఫోన్లో చూసుకుని మాట్లాడుకుంటే సరిపోతుందని అనుకుంటున్నారు. అన్ని బాగున్నపుడే చక్క దిద్దుకోవాలని అందరినీ విడిచిపెట్టి డబ్బు వెంట పడుతున్నారు. మరి ఇలాంటి సమయంలో డబ్బు నిజంగా అన్నింటినీ తెచ్చి పెడుతుందా అంటే కొన్ని రోజులు పోయాక అసలు విషయం అర్థమై బాధపడటం తప్ప ఏమీ చేయలేరు.
అయితే వలసలు వెళుతున్న వారు ఆయా దేశాల్లో తీవ్ర వివక్షకు గురవుతున్నారు. తమ దేశంలో గతి లేకుండా వలస వెళుతున్న వారి విషయంలో మాత్రం ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వేధింపులతో, సరైన వసతులు లేక, ఆయా దేశాల్లో పరిస్థితులకు అలవాటు పడక చాలా మంది చనిపోతున్నారు. అయితే యూరప్ దేశాలకు అక్రమంగా వెళ్లేందుకు ప్రయత్నించి దాదాపు బోట్ యాక్సెడెంట్ లో ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు దాదాపు 1800 మంది చనిపోయారు. వీరంతా ఆయా దేశాల నుంచి శరణార్థులుగా యూరప్ దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన వారే కావడం ఇక్కడ గమనార్హం.
సొంత దేశంలో ఉండలేక, ఉపాధి కరవై అంతర్గత ఘర్షణల వల్ల వెళ్లే వారు ఇలాంటి వాటిలో మరణిస్తున్నారు. మరి కొందరు బాగా సెటిలైన కూడా అక్కడ జాత్యాహంకార వివక్షకు గురై వేధింపులతో చనిపోతున్న వారు ఉన్నారు. జీవనోపాధి కోసం ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు.