షాకింగ్ : 31 ఏళ్ల వయసులో గర్భం.. 92 ఏళ్ల వయసులో డెలివరీ?

praveen
ప్రస్తుతం సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలోనే ప్రపంచ నలుమూలలో ఎక్కడ ఏం జరిగినా కూడా ఎంతోమంది తెలుసుకోగలుగుతున్నారు. అయితే సోషల్ మీడియాలో సామాన్యులు సంపన్నులు అనే తేడా లేకుండా పోయింది. కేవలం ఒక బ్లూటిక్ తప్ప సెలబ్రిటీలు చేయగలిగిన అన్ని విషయాలను కూడా సామాన్యులు సైతం చేసేస్తున్నారు. అరచేతిలో ఉన్న స్మార్ట్ఫోన్ లోనే ప్రపంచాన్ని చుట్టేస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఇలా వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి.


 కలలో కూడా కనీ విని ఎరుగని ఘటనలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇలాంటి ఘటనలు గురించి తెలిసినప్పుడు ఇది నిజమేనా అని నమ్మడానికి కూడా కాస్త టైం పడుతుంది. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. సాధారణంగా పెళ్లయిన తర్వాత ఏ మహిళ అయినా గర్భం దాల్చడం సర్వసాధారణం. కానీ ఇలా గర్భం దాల్చిన మహిళ కొన్ని దశాబ్దాల తర్వాత ఇక సర్జరీ ద్వారా డెలివరీ చేయడం గురించి ఎప్పుడైనా విన్నారా  అదేంటి గర్భం దాలిస్తే తొమ్మిది నెలల తర్వాత డెలివరీ చేస్తారు. నార్మల్ డెలివరీ అయితే ఓకే లేదంటే సిజేరియన్ చేస్తారు కదా అని చెబుతారు ఎవరైనా


 కానీ ఇక్కడ మాత్రం వైద్యులే ఆశ్చర్యపోయే వింత ఘటన జరిగింది. చైనాలో ఇది వెలుగులోకి వచ్చింది. హువాంగ్ యుజూన్ అనే మహిళ 1948లో 31 ఏళ్ల వయసులో గర్భం దాల్చింది. అయితే పిండం గర్భాశయానికి వెలుపల పెరుగుతుందని అబార్షన్ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. కానీ అప్పటికి ఆమె ఆర్థిక పరిస్థితి బాలేదు. దీంతో అబార్షన్ చేయించుకోలేదు. చివరికి 92 ఏళ్ళ వయసు వరకు అలాగే ఉంది. ఇటీవల ఆసుపత్రికి వెళ్ళగా విషయం తెలుసుకున్న వైద్యులు షాక్ అయ్యారు. చివరికి ఆపరేషన్ చేసి ఇక కడుపులో స్టోన్ లా మారిపోయిన బిడ్డను బయటకు తీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: