రూ.80కే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు.. ఎక్కడో తెలుసా?

praveen
తమకంటూ ఒక సొంతిల్లు ఉండాలని ప్రతి ఒక్క సామాన్యుడు కలగంటూ ఉంటాడు. ఈ క్రమంలోనే సొంతింటి కలను సహకారం చేసుకునేందుకు ఇక జీవితాంతం కష్టపడుతూ ఉంటాడు అని చెప్పాలి. కష్టపడిన దాంతో పైసా పైసా కూడబెట్టుకుని ఇక సొంటింటి కలను సహకారం చేసుకోవడం చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది మాత్రం ఇక అద్దె ఇంట్లోనే ఉంటూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. మరి కొంతమంది ప్రభుత్వం ఇచ్చే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం ఎదురు చూడటం చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇక ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా భూముల ధరలు ఏ రేంజ్ లో పెరిగిపోయాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే ఒక ఫ్లాట్ కొనాలంటేనే సామాన్యుడు కొనలేని పరిస్థితి నెలకొంది. అలాంటిది ప్లాట్ కొనుగోలు చేసి ఇక సొంతింటిని కట్టుకోవడం అంటే అది సామాన్యుడికి కలలో సాధ్యమవుతుంది తప్ప నిజం అవడం మాత్రం అసాధ్యమని చెప్పాలి.

 కానీ ఏకంగా 80 రూపాయలకే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తున్నారు అంటే ఎవరైనా నమ్ముతారా.. ఈ విషయం చెబితే ఇది జోక్ ఆఫ్ ది డే అని కాసేపు నవ్వుకొని సైలెంట్ గా ఊరుకుంటారు అందరూ. కానీ ఇక్కడ మాత్రం నిజంగానే కేవలం 80 రూపాయలకే  ఒక డబుల్ బెడ్ రూమ్ పొందవచ్చు. అవునా ఎక్కడ కాస్త అడ్రస్ చెప్పండి.. మాక్కూడా కావాలి అనుకుంటున్నారు కదా. అలా తొందరపడకండి ఎందుకంటే ఇది మన దేశంలో కాదు ఏకంగా యూఎస్లో. యూఎస్ లోని మిచిగాన్ లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేవలం 80 రూపాయల ధర పలికింది. ఇక ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి. డెత్ రైట్ ప్రాంతానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నివాసం ఉంది అన్న విషయాన్ని న్యూయార్క్ పోస్ట్ పేరుకుంది.

 కాగా ప్రస్తుతం ఈ భవనం శిథిలావస్తలో ఉండడం గమనార్హం. ఈ భవనాన్ని 1956లో నిర్మించగా ఇక ఈ భవనాన్ని మళ్లీ బాగు చేయించడానికి దాదాపు 20,000 డాలర్ల వరకు ఖర్చు అవుతుందని ఏజెంట్ హుబెల్ పేర్కొన్నారు. దీంతో ఇక ఈ ఇంటిని వేలంలో పెట్టగా కేవలం ఒకే ఒక్క డాలర్ అంటే భారత కరెన్సీ ప్రకారం 80 రూపాయలు మాత్రమే పలికింది.  ఇక దీంతో ఈ ఇల్లు ప్రపంచ రికార్డు కూడా సృష్టించింది. ప్రపంచంలోనే చౌకైన ఇల్లుగా  మారిపోయింది ఈ భవనం. ఏది ఏమైనా యూఎస్ లాంటి దేశంలో కేవలం 80 రూపాయలకే ఇల్లు అంటే వినడానికి కాస్త విచిత్రంగా ఉంది కదా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: