110 వృద్ధుడికి నాలుగో పెళ్లి.. ఇంతకి మహిళ వయస్సెంతో తెలుసా?
వెరసి ఎంతో మంది పెళ్లయిన కొన్నాళ్లకే విడిపోతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయ్. అయితే మరి కొంతమంది ఏకంగా పెళ్లిని నిత్య కృత్యంగా చేసుకుంటూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటున్న వారు కూడా నేటి రోజుల్లో చాలామంది కనిపిస్తూ ఉన్నారు. అయితే ఇలా ఎక్కువ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు అంటే చాలు వాళ్లు వయసులో ఉండి ఉంటారు అందుకే ఇలా పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకోవాలని ఆలోచనతో ఉన్నారు అని అనుకుంటారు చాలామంది. కానీ ఇక్కడ జరిగిన పెళ్లి గురించి తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకుంటారు.
అతనికి 110 ఏళ్ళ వయసులో ఎవరైనా కృష్ణారామ అనుకుంటూ హాయిగా మనవళ్ళు మనవరాళ్లతో ఆడుకుంటూ ఉంటారు. జీవితంలో అంతా చూసాం ఇంకా చూడాల్సింది ఇంకేముంది అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ 110 ఏళ్ళ వృద్ధుడు మాత్రం ఆ వయసులో నాలుగో పెళ్లి చేసుకున్నాడు. ఇంతకీ అతని పెళ్లి చేసుకున్న మహిళ వయసు ఎంతో తెలుసా 55 ఏళ్ళు.. ఈ ఘటన పాకిస్తాన్లోని కైబర్ పక్తున్వ లో వెలుగు చూసింది ఒంటరిగా ఫీలవుతున్నానని అబ్దుల్ హసన్ అనే వృద్ధుడు 55 ఏళ్ల మహిళను వివాహమాడాడు. హాసన్ కుటుంబంలో ఇప్పటికే 84 మంది ఉండగా.. అతని పెద్ద కుమారుడి వయసు 70 ఏళ్ళు. అయితే ఈ కురువృద్ధుడికి ఏకంగా 5000 రూపాయల కట్నం ఇచ్చి పెళ్లి చేశారట.