చంద్రుడిపైకి మనిషిని పంపిన పాక్.. వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు?
అయితే కొంతమంది పాకిస్థానీయులు మాత్రం తాము ఇప్పటికే చంద్రుడిపై ఉన్నాము అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఇలాంటి వ్యాఖ్యలు చేయడమే కాదండోయ్ అటు అక్కడి కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇటీవలే పాకిస్తానీలు ఏకంగా చంద్రుడి పైకి రాకెట్ ప్రయోగించారు అన్నట్లుగా ఒక ఫన్నీ వీడియోని రెడీ చేశారు. ఇది చూసి చూసి ఇంటర్నెట్ జనాలు నవ్వకుండా ఉండలేకపోతున్నారు అని చెప్పాలి. ఇక ఈ వీడియో కాస్త ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది.
ఏకంగా ఒక వ్యక్తిని చంద్రుడు పైకి పంపినట్లు ఈ వీడియోలో చూపించారు. అయితే ల్యాబ్ నుంచి వారు పనిచేస్తున్నట్లు కనిపించారు. రాకెట్‌తో పంపిన వ్యక్తి టేక్ ఆఫ్ సమయంలో హాస్యాస్పదంగా దాన్ని జారవిడుచుకోవడంతో వీడియో ప్రారంభమవుతుంది. ఇక ల్యాబ్ లో పని చేస్తున్న వ్యక్తుల్లో ఒకరు అతనికి భరోసా ఇస్తూ సమస్య లేదు అక్కడికి చేరుకునే శక్తి మీకు ఉంది అని చెబుతాడు. ఆ తర్వాత విఎఫ్ ఎక్స్ ఎడిటింగ్ లో ఆ వ్యక్తి భూమి నుంచి స్పేస్ లోకి వెళ్తున్నట్లు చూపించారు. అంతలోనే ల్యాప్‌టాప్ ఆపరేటింగ్ చేస్తున్న ఒక వ్యక్తి నమ్మకంగా ఇది జరగదు అంటాడు. మనం ఎప్పటికి చంద్రునికి చేరుకోలేమనీ భారతదేశం భావించింది అని చెప్పాడు. ఇలా వీడియో మొత్తం జబర్దస్త్ కామెడీ స్కిట్ లాగా నవ్వులు పూయిస్తుంది అని చెప్పాలి.