ఈ ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్.. పలికిన ధర తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది?

praveen
సాధారణంగా సామాన్యులు అయితే జీవితంలో ఒక్కసారైనా కార్లు కొనాలి అని భావిస్తూ ఉంటారు. కానీ సంపన్నులు మార్కెట్లోకి ఏ కొత్త మోడల్ వచ్చినా సరే అది నచ్చిందంటే నిర్మొహమాటంగా ఇక కారును కొనుగోలు చేస్తూ ఉంటారు అని చెప్పాలి.  ఇక వారి దగ్గర అప్పటికి ఎన్ని కార్లు ఉన్నప్పటికీ కూడా కొత్త కారును కొనుగోలు చేస్తే ఆ కీక్కే వేరు అని భావిస్తూ ఉంటారు. అయితే కోట్లు పోసి కారు కొనుక్కోవడం మాత్రమే కాదు.. కొన్ని కొన్ని సార్లు ఏకంగా కార్లకు ఉండే నెంబర్ ప్లేట్ విషయంలో కూడా కోట్లు ఖర్చు పెట్టేందుకు ఎంతో మంది వెనకడుగు వేయరు.


 ఈ క్రమంలోనే ప్రస్తుతం మార్కెట్లో ఫ్యాన్సీ నెంబర్లకు ఏ రేంజ్ లో డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సామాన్యులు సైతం తమకు నచ్చిన ఫ్యాన్సీ నెంబర్ తమ వాహనానికి ఉంటే బాగుంటుందని అనుకుంటూ ఉంటారు. అలాంటిది సంపన్నులు ఇక ఇలా ఫ్యాన్సీ నెంబర్ల కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా సరే సిద్ధమవుతూ ఉంటారు అని చెప్పాలి. కొన్ని కొన్ని సార్లు ఫ్యాన్సీ నెంబర్లకు పలికే ధర గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇలాంటి ఫ్యాన్సీ వెహికల్ లైసెన్స్ ప్లేట్ల అమ్మకాలకు వేలంపాట నిర్వహిస్తారు అనే సంగతి తెలిసిందే.


 వేలం పాటలో అధిక మొత్తంలో పాట పాడిన వారు.. ఇక నెంబర్ ప్లేట్ దక్కించుకుంటారు. అయితే ఇలాంటి వేలంపాట ఒకటి దుబాయిలో జరిగింది. అయితే ఇక్కడ ఒక నెంబర్ ప్లేట్ కి పలికిన ధర తెలిసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. ఏకంగా ఒక వ్యక్తి లక్షలు కాదు 8,30 కోట్ల రూపాయలు పెట్టి ఫాన్సీ నెంబర్ ప్లేట్లు కొనుగోలు చేశాడు. ఇటీవల దుబాయ్ లో జరిగిన ఫాన్సీ నెంబర్ ప్లేట్ వేలంపాటలో.. ఒక వెహికల్ లైసెన్స్ ప్లేట్ నెంబర్ దాదాపు 3.82 మిలియన్ దిర్హంలు ధర పలికేంది. భారత కరెన్సీ లో 8 కోట్ల 62 లక్షల 98,370 రూపాయలు అని చెప్పాలి.  ఇలా ఏ ఏ 70 నెంబర్ ప్లేట్ ధర వేలంలో అత్యధిక తరపు అమ్ముడుపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nri

సంబంధిత వార్తలు: