మరో దేశంలో.. మనోడు కింగ్‌ అయ్యాడు?

Chakravarthi Kalyan
భారత సంతతి వ్యక్తులు వివిధ దేశాల్లో కీలక పదవులు దక్కించుకుంటున్నారు. తాజాగా భారత సంతతికి చెందిన ఆర్థిక వేత్త షణ్ముగ రత్నం సింగపూర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయనకు 70.04 శాతం ఓట్లు పడ్డాయి.  పోలైన 20.40 లక్షల ఓట్లలో షణ్ముగరత్నానికి 17. 46 లక్షల ఓట్లు పోలయ్యాయి. దీంతో ఆయన విజయం సాధించారు. సింగపూర్ లో మలేషియా, చైనా వాళ్లు ఎక్కువగా ఉంటారు. షణ్ముగ రత్నం ప్రత్యర్థులైన చైనా సంతతి కి చెందిన ఎన్ జీ సాంగాంగ్, టాంగ్ లకు 15 శాతం, 13 శాతం ఓట్లు పోలయ్యాయని అక్కడి ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన భారత సంతతికి చెందిన మూడో అధ్యక్షుడిగా షణ్ముగరత్నం నిలిచారు.


ఈ సందర్భంగా ప్రధానమంత్రి లీ సన్ యూంగ్ షణ్ముగరత్నానికి అభినందనలు తెలిపారు.  
ప్రధాని ఆధ్వర్యంలో పీపుల్స్ యాక్షన్ పార్టీ షణ్ముగరత్నానికి ఎన్నికల్లో మద్దతు తెలిపింది. గతంలో భారత సంతతికి చెందిన ఎస్. రామనాథన్, దేవ నారాయణ్ ఇద్దరు సింగపూర్ అధ్యక్షులుగా పని చేశారు.  ప్రస్తుతం సింగపూర్ అధ్యక్షుడిగా ఎన్నికైన షణ్ముగరత్నం 2011 నుంచి 2019 వరకు ఉప ప్రధానిగా అక్కడ పని చేశారు.  ఈ మధ్య కాలంలో క్యాబినేట్ లో సీనియర్ మంత్రిగా విధులు నిర్వర్తించారు.  ఈయనకు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆర్థికవేత్తగా గుర్తింపు ఉంది.


ఈయన సింగపూర్ లో స్థిరపడ్డ తమిళ కుటుంబంలో ఆయన 1957 లో పుట్టారు.  అసలు పాయింట్ ఏమిటంటే సింగపూర్, సూపర్ అద్భుతం అని చాలా మంది చెబుతుంటారు. సింగపూర్ దాదాపు వైజాగ్ కంటే చిన్నదని తెలుసుకోవచ్చు. అయితే సింగపూర్ లో ఎక్కువ మంది ఉంటారు. అయితే అమరావతిలో భూములకు సంబంధించి అవినీతి చేసిన వ్యక్తి సింగపూర్ కు చెందిన వారు ఉన్నారు. సింగపూర్ కు చెందిన వారు ఆ దేశంలో మాత్రం అవినీతి చేయరు. కానీ వివిధ దేశాల్లో మాత్రం చాలా కంపెనీలు పెట్టి అవినీతి చేస్తున్నట్లు బయటపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: