యాపిల్ ఫోన్లు వాడొద్దు.. చైనా షాకింగ్ నిర్ణయం?
అయితే మార్కెట్లోకి ఎన్ని కంపెనీలకు చెందిన మొబైల్స్ వచ్చిన.. ఎన్ని సరికొత్త ఫీచర్లు అందించిన.. ఒక్క మొబైల్ కి ఉన్న మార్కెట్ డిమాండ్ మాత్రం ఇప్పటివరకు తగ్గలేదు అని చెప్పాలి. అదే యాపిల్ ఫోన్. మిగతా మొబైల్ ఫోన్లతో పోల్చి చూస్తే కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. కానీ ఈ మొబైల్ ఫోన్ వాడటానికి అటు అందరూ కూడా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఏకంగా యాపిల్ ఫోన్ వాడకం తమ స్తోమతను తెలియజేస్తుందని కొంతమంది భావిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే లక్షలు ఖర్చు చేసి మరి మొబైల్ కొనడానికి ఇష్టపడుతూ ఉంటారు.
అయితే కేవలం మనదేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో కూడా యాపిల్ ఫోన్ కి ఇదే రేంజ్ లో మార్కెట్ ఉంది. అయితే జపాన్ కు సంబంధించిన ఈ యాపిల్ ఫోన్ల విషయంలో ఇటీవల చైనా కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో యాపిల్ ఫోన్ కంపెనీకి భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది చైనాలోని ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు కూడా యాపిల్ సహా ఇతర విదేశీ బ్రాండ్ల ఫోన్లు వాడొద్దు అంటూ చైనా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కింది స్థాయి ఉద్యోగులకు ఇప్పటికే ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. అయితే డేటా సెక్యూరిటీ పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్న చైనా ఈమెరకు నిర్ణయం తీసుకుంది. అయితే యాపిల్ కి చైనా అతిపెద్ద మార్కెట్.. ఇప్పుడు చైనా ప్రభుత్వ నిర్ణయంతో యాపిల్ కు నష్టాలు వచ్చేలాగే ఉన్నాయి.