అమెరికాలో ఎన్నారై బతుకులు ఇంత దారుణమా?

Chakravarthi Kalyan
అమెరికాలో పోలీసు చేసిన యాక్సిడెంట్ లో జాహ్నవి అనే ఇండియా అమ్మాయి చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే రాంగ్ రూట్ లో వచ్చి యాక్సిడెంట్ చేయడమే కాకుండా జాత్యాంహాకార వ్యాఖ్యలు చేయడాన్ని అమెరికా లోని ఇండియన్ ప్రజా ప్రతినిధులతో పాటు అందరూ తీవ్రంగా ఖండించారు. యాక్సిడెంట్ చేసిన పోలీసు ఎనిమిది వేల డాలర్లు ఇస్తే సరిపోతుందని చావును కూడా తేలికగా తీసిపారేయడం వివాదంగా మారింది.


అమెరికాలో ఇండియన్స్ కు ఉన్న ప్రగతి రేటు బ్రతుకు రేటు ఇదని అందరూ చర్చించుకుంటున్నారు.  అమెరికాలో వాషింగ్టన్ లోని నార్త్ ఈస్ట్ యూనివర్సిటీలో చదువుకుంటున్న జాహ్నవి వెళుతున్న రూట్ లో కేవలం 25 కిలోమీటర్ల వేగంతో వెళ్లాల్సిన పోలీసు వాహనం దాదాపు 75 కిలోమీటర్ల వేగంతో వెళ్లడమే కాకుండాా ఆమె ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. కానీ దానికి బాధపడకుండా ఆమెకు కేవలం 26 ఏళ్లు మాత్రమే దీనికి అంత మాత్రం బాధపడాల్సిన అవసరం లేదు.


డబ్బులిచ్చేస్తే సరిపోతుందని జాత్యాంహాకార వ్యాఖ్యలు చేయడం అమెరికన్లకు ఇండియన్స్ మీద ఉన్న వైఖరి తెలుస్తుంది. ముఖ్యంగా ఆ పోలీసు అధికారిపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం కూడా మరింత వివాదం చెలరేగడానికి కారణమవుతుంది. సదరు పోలీసుల అధికారిపై ఇప్పటికైనా సరైన చర్యలు తీసుకుని మరోసారి ఇలాంటి వ్యాఖ్యానాలు చేయకుండా ఉండాలని కోరారు.


ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల అమెరికాలో మరోసారి జాత్యాంహాకార  విధానాలు మళ్లీ బయటపడ్డాయి. అమెరికాలో రెండేళ్ల కిందట ఒక నల్లజాతీయుడిని బూటు కాలితో తొక్కి ఊపిరాడకుండా చేసి చంపేసిన పోలీసుల తీరుపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. అమెరికాలో నల్లజాతీయులపై వివిధ దేశాల నుంచి వచ్చిన వారికి సరైన గుర్తింపు ఇవ్వకుండా తీవ్రమైన జాత్యాంహకార వ్యాఖ్యలు చేస్తూ అవమానపరచడం అక్కడి పోలీసులకు అలవాటుగా మారిందని అంటున్నారు. ఈ విధానాన్ని మార్చుకోవాలని సదరు పోలీసు అధికారి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

NRI

సంబంధిత వార్తలు: