చంద్రయాత్ -3.. చంద్రుడిపై దిగలేదా?

praveen
ఇటీవల యావత్ భారతదేశం మొత్తం గర్వించదగ్గ ఘటన ఒకటి జరిగింది. అదే చంద్రయాన్ 3. ఎన్ని సార్లు విఫలమైనా పట్టు వదలని విక్రమార్కుడిలా ఇస్రో శాస్త్ర వేత్తలు నిరంతరం కష్టపడి ఇక చంద్రయాన్ 3 తో సక్సెస్ అయ్యారు అనే విషయం తెలిసిందే. ఎంతో విజయవంతం గా చంద్రుని ఊపలితలంపై లాండర్, రోవర్ ల్యాండ్ అయింది. ఇక ఈ సక్సెస్ తో ప్రపంచ దేశాలు మొత్తం అటు భారత్ వైపు చూసాయ్. అయితే చంద్రుడి దక్షిణ ధ్రువం పై ఇలా అంతరిక్ష పరిశోధనను ల్యాండ్ చేసిన మొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది అని చెప్పాలి.


 ఇస్రో శాస్త్ర వేత్తలు కష్టానికి ప్రతిఫలం దక్కింది అంటూ భారత ప్రజలందరూ కూడా హర్షద్వానాలు వ్యక్తం చేశారు. అయితే ఇంతకుముందే అమెరికా, చైనా, మరియు సోవియట్ యూనియన్ దేశాలు చంద్రుడి పై రోవర్ను లాంచ్ చేయగా ఇక ఇప్పుడు చంద్రుడు పై అడుగు పెట్టిన నాలుగో దేశంగా నిలిచింది భారత్. అయితే ఇలా చంద్రుడిపై కాలు మోపిన విక్రమ్ లాండర్, ప్రజ్ఞా రోవర్ సమర్థవంతం గా పరిశోధన కొనసాగించాయి. అయితే భారత్ సాధించిన విజయం పై ప్రపంచ దేశాలు మొత్తం హర్షం వ్యక్తం చేస్తుంటే చైనా మాత్రం వక్రబుద్ధిని చూపించింది.


 అందరూ అనుకుంటున్నట్లుగా ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని తాకలేదని చైనాకు చెందిన శాస్త్రవేత్త వయాంగ్ జీయువన్ కామెంట్ చేశారు. ఇస్రో ప్రకటించిన చంద్రయాన్ 3 ల్యాండింగ్  ఫై అనుమానాలు వ్యక్తం చేశారు. విక్రమ్ ల్యాండర్ ప్రజ్ఞా రోవర్లు నిద్రాణ స్థితి నుంచి పునరుద్ధరించడానికి భారత్ ప్రయత్నిస్తున్న సమయంలో చైనా ఇలాంటి తరహా వ్యాఖ్యలు చేయడంతో అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు  భారత్ సాధించిన గొప్ప విజయాన్ని చైనా జీర్ణించుకోలేక పోతుంది అంటూ ఇండియన్స్ అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: