ఉక్రెయిన్ యుద్ధాన్ని వారంలో ఆపేస్తానంటున్న ఇండియన్‌?

Chakravarthi Kalyan
ప్రక్క దేశాలకు శరణార్థులుగా వెళ్లిన వాళ్ళు అక్కడి ప్రభుత్వ చట్టాలను కూడా తమకు అనుకూలంగా మార్చి‌ వేయాలని చూస్తున్నారు. ఈ విధంగా ప్రక్క రాజ్యాలను కూడా తమ మాత రాజ్యాలుగా మార్చి‌ వేయాలని ప్రయత్నిస్తున్నారు వీళ్ళు.  వివేక్ రామస్వామి ట్రంప్ తర్వాత రిపబ్లిక్ అండ్ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన అభ్యర్థి. ఒకవేళ రేపు ట్రంప్ కనుక జైలుకు వెళ్తే  ఆయన పోటీ చేయలేడు కాబట్టి ఆయన బదులుగా ఈయన పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది.


ఆ వివేక్ రామస్వామి రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి ఒక మాట చెప్పడం జరిగింది. తాను కనుక అధికారంలోకి వస్తే వెంటనే అక్కడి  పరిస్థితులు చక్కదిద్దుతానని అన్నారట. అమెరికా అలాగే ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఒక వారంలో ఆపేస్తానని ఆయన చెప్పడం జరిగింది. అమెరికాకు ఉక్రెయిన్ దేశం నుండి వలస వచ్చిన వాళ్లు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. ప్రత్యేకించి అమెరికా యూరప్ దేశాలలో అధిక సంఖ్యలో ఇలా వలస వచ్చిన వాళ్లు కనిపిస్తూ ఉంటారు ఇప్పుడు.


అయితే ఇలా వలస వచ్చిన వాళ్ళు ఆ దేశాన్ని నొప్పించకుండా, మెప్పించే తరహాలో పనిచేయాల్సి ఉంటుంది. అంతే గాని ఆ దేశం పైకే దాడి చేయడం, మత రాజ్యాలను ఏర్పాటు చేయడం కోసం అక్కడ చట్టాన్ని మార్చాలని కోరుకోవడం చాలా తప్పు. దీనికి ఉదాహరణగా   కొంతమంది దుండగులు వివేక్ రామస్వామి పై  చేసిన దాడిని చూపిస్తున్నారు. వివేక్ రామస్వామి ఎన్నికల ప్రచారం కోసం వెళ్ళినప్పుడు ఈ విధంగా జరిగిందట.


అయితే  దీనిపై రామ స్వామి స్పందిస్తూ ఇలా ఆయనపై దాడి చేసిన వ్యక్తులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారట.‌ శరణార్థులుగా వెళ్లిన వాళ్ళు శరణార్థులుగా ఉండాలి. అంతే గాని వాళ్లు ఏ దేశంలో అయితే తలదాచుకుంటున్నారో ఆ దేశంలోని వాళ్ళ పైనే దాడి చేయాలని అనుకోవడం, ప్రయత్నించడం చాలా తప్పు అని కొంతమంది సామాజిక విశ్లేషకులు చెబుతున్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: