50 కిలోమీటర్లు పరిగెత్తితే బోనస్.. చైనా కంపెనీ వింత కండిషన్?
సాధారణంగా కంపెనీలో పని చేసే ఉద్యోగులకు ఆయా కంపెనీ యాజమాన్యాలు ప్రోత్సాహకాలుగా అప్పుడప్పుడు బోనస్ లు అందించడం లాంటివి చేస్తూ ఉంటాయ్. ఇక మన దేశంలో అయితే పండగలకు లేదంటే ఇంకా మిగతా ఏదైనా ప్రత్యేకమైన రోజులకు.. ఉద్యోగుల పనితీరును బట్టి ఇలాంటి బోనస్ లు ఇవ్వడం చేస్తూ ఉంటారు ఇక ఇతర దేశాల్లో ఇక ఆయా ఉద్యోగుల పనితీరును బట్టి బోనస్ లు అందిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే చైనాకు చెందిన ఒక సంస్థ మాత్రం పని తీరును బట్టి కాదు ఏకంగా పరిగెత్తడాన్ని బట్టి బోనస్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.
చైనాకు చెందిన డాంగ్ పో అనే పేపర్ కంపెనీ ఉద్యోగులకు వినూత్నమైన రీతిలో బోనస్ ఆఫర్ను ప్రకటించింది. నెలకు 50 కిలోమీటర్లు పరిగెత్తిన వారికి ఫుల్ బోనస్ ఇస్తాము అంటూ ప్రకటించింది. 40 కిలోమీటర్లు పరిగెత్తిన వారికి 60 శాతం మంత్లీ బోనస్.. 30 కిలోమీటర్లు పరిగెత్తిన వారికి 30% బోనస్ అందించనున్నట్లు ప్రకటన చేసింది. అయితే ఎవరైనా ఉద్యోగులు 100 కిలోమీటర్లు పరిగెత్తితే ఇక ఫుల్ బోనస్ తో పాటు అదనంగా మరో 30% అందిస్తాము అంటూ తెలిపింది. ప్రతి ఏటా ఉద్యోగులకు ఇచ్చే బోనస్ విధానాన్ని రద్దుచేసి ఇక ఈ కొత్త విధానాన్ని తీసుకురావడం గమనార్హం. తమ ఉద్యోగులు ఫిట్ గా ఉండడం కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకుందట. ఫోన్లో ఇన్స్టాల్ చేసిన కంపెనీ యాప్ ద్వారా ఇక ఉద్యోగులు ఎంత దూరం పరిగెడుతున్నారు అన్న విషయాన్ని కంపెనీ గ్రహిస్తుందట.