షాకింగ్ దృశ్యం.. గ్లాస్ లో బీర్ పోస్తుండగా గడ్డకట్టుకుపోయింది?

praveen
చలికాలం వచ్చింది అంటే చాలు జనాలందరూ కూడా ఎక్కడో మూలన దాచిపెట్టిన స్వెటర్లను బయటికి తీసి వేసుకోవడం చేస్తూ ఉంటారు. ఒకవేళ చలి తీవ్రత పెరిగితే ఓరి నాయనో ఇదెక్కడ చలి రా బాబు ఏకంగా గడ్డకట్టేలాగే ఉన్నాం అని అనుకుంటూ  ఇక ఎక్కడో ఒక దగ్గర కూర్చుని మంట వేసుకొని కాచుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక సంవత్సరంలో ఒకసారి చలికాలం వస్తేనే ఇలాంటి పరిస్థితి ఉంటుంది. కానీ కొన్ని ప్రాంతాలలో మాత్రం ఇక ఏడాదిలో ప్రతిరోజు కూడా చలే ఉంటుంది. ఏకంగా దట్టమైన మంచుతో కొన్ని ప్రాంతాలు నిండి ఉంటాయి. ఇక అలాంటి వాటిలో దక్షిణ ధ్రువం దగ్గర ఉన్న అంటార్కిటికా ప్రాంతం కూడా ఒకటి అని చెప్పాలి.


 అయితే ఆయా ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు ఎంత దారుణంగా పడిపోతాయి అన్నదానికి సంబంధించి కళ్లకు కట్టినట్లుగా చూపించే ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఏకంగా ప్రస్తుతం అక్కడ మైనస్ 64 డిగ్రీల వాతావరణం ఉందని చెప్పాలి  ఇంత చలిలో మనుషులు బ్రతకగలరా అని అనుమానం కూడా ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది. అయితే జెఫ్ అనే వ్యక్తి అదే ప్రాంతంలో మైనస్ 64 డిగ్రీల చలిలో తిరుగుతూ ఉన్నాడు.


 ఈ క్రమంలోనే కొంచెం బీరు తాగాలని అనుకున్నాడు. బీర్ క్యాన్ ఓపెన్ చేసి గ్లాసులో బీర్ పోసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ఆ తర్వాత జరిగింది చూసి అతను ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయాడు. ఎందుకంటే బీరు ఓపెన్ చేసి గ్లాస్ లో పోసుకుంటుండగా క్షణాల వ్యవధిలోనే బీరు గడ్డ కట్టేసింది. ఏకంగా గ్లాస్  బీర్, క్యాన్ ఒకదానికొకటి అతుక్కుపోయి ఉండిపోయాయి. దీంతో ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి అన్నట్లుగా ఈ గడ్డకట్టుకుపోయిన బీర్, గ్లాస్, క్యాన్ ను చూపించాడు  ఇది చూసి నేటిజన్స్ అందరు కూడా షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: