అమెరికాలో సంక్షోభం.. ఇక అక్కడికి వెళ్లాలంటే భయపడతారేమో?
దీంతో ఇక ఉద్యోగం మీద ఆధారపడి జీవిస్తున్న ఎంతోమంది ఉద్యోగం ఊడిపోయి రోడ్డునపడే పరిస్థితి నెలకొంది. ప్రాప్టెక్, బెటర్ డాట్ కామ్, అమెజాన్, యూనిటీ సాఫ్ట్వేర్, గూగుల్ లాంటి ఎన్నో కంపెనీలు తమ సంస్థలో పనిచేస్తున్న చాలా మంది ఉద్యోగులను చెప్పా పెట్టకుండానే అకస్మాత్తుగా తొలగిస్తూ ఉన్నాయి. గత ఏడాది నుంచే ఇక ఇలాంటి పరిస్థితులను నెలకొన్నాయట. అయితే పరిస్థితులు మెరుగుపడతాయని ఎంతో మంది ఎదురుచూసిన.. ఇక ఐటీ రంగంలో కొత్త పెట్టుబడులు రాకపోవడంతో పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడం లేదట.
గత ఏడాదిలోనే దాదాపుగా 2,40,000 మందిని ఐటి కంపెనీలు ఉద్యోగాల నుంచి తొలగించాయట. ఈ ఏడాదిలో జనవరి ముగిసే సమయానికి ఏకంగా 32 వేల మంది ఇలా ఉద్యోగాలు కోల్పోయారట. ఇక ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్స్ ప్రాముఖ్యత పెరిగిపోతున్న నేపథ్యంలో.. అటు ఆయా కంపెనీలు ఉద్యోగులకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదట. ఇక మరోవైపు అధిక వడ్డీ రేట్లు, ఆర్థిక సమస్యలు కూడా ఇలాంటి లేఅఫ్స్ కు కారణమవుతున్నాయట. అయితే భారత్ నుంచి చాలామంది అమెరికాలో ఉద్యోగం చేయడానికి వెళుతూ ఉంటారు. ప్రస్తుతం అక్కడ ఉన్న సంక్షోభ పరిస్థితులు చూస్తుంటే ఇక చాలామంది అమెరికా వెళ్లడానికి వెనకడుగు వేసే ప్రసక్తి ఉంది.